Site icon 10TV Telugu

Mahesh Babu : కామిక్ కాన్ ఈవెంట్‌లో గుంటూరు కారం ఘాటు.. సర్రా సరాసర అంటున్న స్పైడర్ మెన్..

Mahesh Babu guntur kaaram Ramana Aei song at Toronto Comic con

Mahesh Babu guntur kaaram Ramana Aei song at Toronto Comic con

Mahesh Babu : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ సమయంలో కంటే.. ఇప్పుడు ఎక్కువ పాపులారిటీని సంపాదించుకుంటుంది. ఈ మూవీలోని సాంగ్స్ మెల్లిమెల్లిగా ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతుండడంతో.. ప్రస్తుతం గ్లోబల్ వైడ్ ఈ సాంగ్స్ వినిపిస్తూ వస్తున్నాయి. కుర్చీ మడతపెట్టి సాంగ్ మాస్ ఆడియన్స్ తో క్లాస్ ఆడియన్స్ ని కూడా ఒక ఊపు ఊపేస్తోంది.

హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ పాటకి చెందేస్తూ సందడి చేస్తున్నారు. అమెరికాలోని పలు ఈవెంట్స్ లో కూడా ఈ పాట వినిపిస్తూ మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇప్పుడు ‘రమణ’ సాంగ్ కూడా వైరల్ అవుతుంది. తాజాగా కెనడా కామిక్ కాన్ ఈవెంట్ లో ఇద్దరు మహేష్ బాబు అభిమానులు స్పైడర్ మెన్ గెటప్ లో సర్రా సరాసర అంటూ రమణ గాడి పాటకి డాన్స్ వేసి అదుర్స్ అనిపించారు.

Also read : Deva Katta : రెండు సినిమాలకు కలిపి ఒకటే సీక్వెల్ తీసుకు వస్తానంటున్న దర్శకుడు.. ప్రస్థానం, రిపబ్లిక్..

ఇక ఈ వీడియోని ఆ ఇద్దరు అభిమానులు.. తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారింది. గుంటూరు కారం సోషల్ మీడియా పేజీ కూడా దానిని షేర్ చేస్తూ మహేష్ బాబుని ట్యాగ్ చేశారు. కాగా ఈ సినిమా సాంగ్స్ కి మొదటిలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. కాని ఇప్పుడు ఈ సాంగ్స్ ఇంటర్నేషనల్ లెవెల్ లో వినిపిస్తూ రీ సౌండ్ క్రియేట్ చేస్తున్నాయి.

Exit mobile version