Guntur Kaaram Update : గుంటూరు కారం నుంచి క్రేజీ అప్‌డేట్.. రొమాంటిక్ సాంగ్
Mahesh Babu Guntur Kaaram Update : సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం.
- Thota Vamshi Kumar
- Published On : December 6, 2023 / 09:50 PM IST
Guntur Kaaram Update
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారికహాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోండగా నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. అందులో భాగంగా ఈ చిత్రంలోని పాటలను వరుసగా విడుదల చేస్తోంది. ‘దమ్ మసాలా’ సాంగ్ ఇప్పటికే దుమ్మురేపగా తాజాగా రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ఇచ్చింది.
సోమవారం (డిసెంబర్ 11) రోజున రెండవ పాటను విడుదల చేయనున్నట్లు నిర్మాత నాగవంశీ సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. ఇది ఓ రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Bhupinder Singh : రీల్ లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ విలన్.. ప్రముఖ నటుడు అరెస్ట్
I will add a #SugarCube also sir ??#SweetSpice ?️?#GunturKaaramSecondSingle ? https://t.co/ouuFvMpebU
— thaman S (@MusicThaman) December 6, 2023
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ ఏఎన్నార్ వర్చువల్ స్టూడియోలో ఓ పాట షూటింగ్ జరుగుతోంది. మరో రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఓ పాట చిత్రీకరణ కోసం చిత్ర బృందం కొచ్చికి వెళ్లనుంది.
