Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి వెళుతున్న మహేష్.. SSMB28 షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్‌కి చెక్కేస్తుంటాడు. ఈ అక్టోబర్‌లో ఫ్యామిలీతో లండన్ వెళ్లిన మహేష్.. అక్కడ వీధుల్లో గౌతమ్-సితారలతో కలిసి సందడి చేశాడు. ఆ టూర్ నుంచి వచ్చిన తరువాత మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో శోక సంద్రంలో మునిగిపోయింది ఫ్యామిలీ మొత్తం. ఇక ఆ సంఘటన నుంచి బయటకి వచ్చిన మహేష్, ఫ్యామిలీ మరో టూర్ ప్లాన్ చేశాడు.

Mahesh Babu : మళ్ళీ వెకేషన్‌కి వెళుతున్న మహేష్.. SSMB28 షూటింగ్ మొదలయ్యేది ఎప్పుడు?

Mahesh Babu is boarding to another vacation

Updated On : December 24, 2022 / 11:42 AM IST

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో వెకేషన్‌కి చెక్కేస్తుంటాడు. ఈ అక్టోబర్‌లో ఫ్యామిలీతో లండన్ వెళ్లిన మహేష్.. అక్కడ వీధుల్లో గౌతమ్-సితారలతో కలిసి సందడి చేశాడు. ఆ టూర్ నుంచి వచ్చిన తరువాత మహేష్ తండ్రి కృష్ణ మరణించడంతో శోక సంద్రంలో మునిగిపోయింది ఫ్యామిలీ మొత్తం. ఇక ఆ సంఘటన నుంచి బయటకి వచ్చిన మహేష్, ఫ్యామిలీ మరో టూర్ ప్లాన్ చేశాడు.

Mahesh Babu: మహేష్ ఫ్యాన్‌కు మసూద పాప రిప్లై.. అంటే అన్నారు కానీ..!

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో వస్తున్న తాజా చిత్రం ‘SSMB28’. ఈ మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న తరువాత హీరోయిన్ పూజ హెగ్దే కాలుకి గాయం అవ్వడం, ఆ తరువాత కృష్ణ మరణంతో సెకండ్ షెడ్యూల్ లేటు అవుతూ వస్తుంది. ఇక అంతా సెట్ అయ్యింది షూటింగ్‌కి వెళ్తారు అనుకుంటే, ఈరోజు శంషాబాద్‌ విమానాశ్రయంలో వెకేషన్ కి వెళుతూ కనిపించి షాక్ ఇచ్చాడు మహేష్ బాబు.

అయితే ఈసారి ఎక్కడికి వెళుతున్నాడు అనేది తెలియాల్సి ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. మరి భారీ అంచనాలు నెలకొలుపుకున్న ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ కి వెళుతుందో చూడాలి.