Mahesh Babu : సుదర్శన్ థియేటర్‌‌లో మహేష్ బాబు.. ఫ్యాన్స్‌తో గుంటూరు కారం..

మహేష్ బాబు తన ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ లో గుంటూరు కారం చూసేందుకు ఫ్యామిలీతో కలిసి వచ్చారు.

Mahesh Babu Namrata Shirodkar at sudarshan theatre to watch guntur kaaram

Mahesh Babu : అతడు, ఖలేజా సినిమాల తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రంలో మహేష్ ఇప్పటివరకు కనిపించినంత మాస్ రోల్‌ లో ఆడియన్స్ ట్రీట్ ఇచ్చారు. దీంతో థియేటర్స్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ కోలాహలం కనిపిస్తుంది. ఇక మహేష్ సినిమా రిలీజ్ అంటే నైజంలో ఏ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయో అందరికి తెలిసిందే.

ముఖ్యంగా మహేష్ బాబు ఫేవరెట్ థియేటర్ సుదర్శన్ లో అయితే ఓ రేంజ్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ఆ సెలబ్రేషన్స్ చూడడానికి మహేష్ బాబు ఫ్యామిలీ కూడా పలు మూవీ రిలీజ్‌లకు అక్కడికి వచ్చి అభిమానులతో సినిమా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా నేడు రిలీజైన గుంటూరు కారంని కూడా సుదర్శన్ లో చూసేందుకు మహేష్, నమ్రత, ఫ్యామిలీతో కలిసి వచ్చారు. అభిమానులతో కలిసి సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’ రివ్యూ.. పండక్కి ఘాటు ఎక్కించి.. ఎమోషన్‌తో కన్నీళ్లు తెప్పించిన బాబు..

ఇక సినిమా విషయానికి వస్తే.. మహేష్ బాబు వన్ మ్యాన్ షోతో కథని నడిపించినట్లు చెబుతున్నారు. ఫస్ట్ హాఫ్ సరదాగా ఎంటర్టైన్ గా సాగిన కథ, సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో ఆకట్టుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. ఈ సంక్రాంతికి
గుంటూరు కారంతో మహేష్ ఘాటు చూపించి ఎమోషన్స్ తో కన్నీళ్లు తెప్పించాడని చెబుతున్నారు. ఇక డాన్స్‌ విషయంలో మహేష్ లో ఇప్పటివరకు చూడని ఎనర్జీ ఈ మూవీలో కనిపిస్తుందట. సినిమాలో మహేష్, శ్రీలీల వేసే స్టెప్పులు ఆడియన్స్ ని ఉర్రూతలూగిస్తున్నాయని చెబుతున్నారు.