Mahesh Babu new poster release from Guntur Kaaram movie
Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), శ్రీలీల (Sreeleela), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవల మూవీ నుంచి రిలీజ్ ఫస్ట్ గ్లింప్స్ ఆ హైప్ ని మరింత పెంచేసింది. మొదటి పోస్టర్ నుంచి మాస్ టచ్ ఇస్తూ మహేష్ బాబుని ఈసారి ఒక కంప్లీట్ మాస్ ఫిలింలో చూడబోతున్నం అనే ఫీలింగ్ కలిపిస్తూ వస్తున్నారు మేకర్స్. ఇక ఈరోజు ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
Mahesh Babu : మహేష్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్.. ఎవరెవరు విష్ చేశారో తెలుసా..?
ఆ పోస్టర్ మహేష్ లుంగీ కట్టి.. బీడీ కాలుస్తూ.. కళ్ళజోడు పెట్టి.. ఊర మాస్ లుక్ లో కనిపించాడు. తాజాగా మరో పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ కూడా మాస్ టచ్ తో అదిరిపోయింది. ఈ పోస్టర్స్ అండ్ గ్లింప్స్ చూస్తుంటే.. ఈసారి బాబు మాస్‌తో బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయంలా కనిపిస్తుంది. అయితే బర్త్ డే ఇలా పోస్టర్స్ తో కాకుండా ఒక చిన్న టీజర్ లేదా సాంగ్ అయినా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది అని కొంతమంది అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Mahesh Babu new poster release from Guntur Kaaram movie
Mahesh Babu : ఫారిన్‌లో ఫ్యామిలీతో మహేష్ బాబు బర్త్ డే వెకేషన్.. పిక్స్ చూశారా..?
ఇక ఈ మూవీ షూటింగ్ లేట్ అవుతూ వస్తుండడంతో చెప్పిన డేట్ ప్రకారం సంక్రాంతి వస్తారా అనే సందేహాలు రావడం మొదలయ్యాయి. ఈ కొత్త పోస్టర్ ఆ సందేహానికి చెక్ పెట్టేశారు. 2024 జనవరి 12న ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలవబోతుందని క్లారిటీ ఇచ్చేశారు. కాగా ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.