బాలీవుడ్ కి మరోసారి నో చెప్పిన మహేశ్

  • Publish Date - April 4, 2019 / 06:59 AM IST

రండి బాబూ రండి ఇదే మా ఆహ్వానం అంటూ రెడ్ కార్పెట్ వేసి మరీ పిలుస్తున్నా.. తెలుగు హీరోలు మాత్రం బాలివుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి నో చెప్పేస్తున్నారు. దేశవ్యాప్తంగా భారీ ఫాన్స్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబైతే అప్పట్లోనే బాలివుడ్ కి వెళ్లడం టైం వేస్ట్ అనేశాడు. రీసెంట్ గా ఓ నేషనల్ లేవల్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మహేశ్ మరోసారి బాలివుడ్ ని రిజెక్ట్ చేశాడు.

ప్రస్తుతం సౌత్ ఇండియన్ మూవీసే బాలివుడ్ లో హవా నడిపిస్తున్నాయి. డైరెక్టర్ రాజమౌళి సినిమాలతో పాటు సౌత్ హీరోలు ప్రభాస్, రజినీకాంత్ సినిమాలకి ఆల్ ఇండియా లెవల్లో క్రేజ్ ఉంది. అలాంటిది ప్రత్యేకంగా బాలివుడ్ లో సినిమాలు చేయాల్సిన అవసరం సౌత్ హీరోలకి అందులోనూ తనకి లేదంటున్నాడు మహేశ్. అంతేకాదు తన టోటల్ ఫోకస్ సౌత్ సినిమాల మీదే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.  

గతంలో అయితే మహేశ్ బాలివుడ్ ఎంట్రీ పక్కా అంటూ చాలా సార్లు రూమర్స్ వినిపించాయి. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ సినిమా చేయనున్నాడని ఆ సినిమా బాలివుడ్ లో తెరకెక్కనున్నట్లు వార్తలొచ్చాయి. మహర్షి సినిమా మేకోవర్ కోసం ముంబాయి వెళ్లినప్పుడు బాలివుడ్ ప్రొడ్యూసర్స్ తో మహేశ్ చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. అయితే అవన్నీ గాలివార్తలే అని మహేశ్ లేటెస్ట్ కామెంట్స్ తో తేలిపోయింది. సో టాలివుడ్ సూపర్ స్టార్ సౌత్ ఇండియాకే ఫిక్సయ్యేందుకు డిసైడ్ అయ్యాడు.