SSMB 29 : ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్ సినిమా.. వాలీబాల్ ఆడిన రాజమౌళి.. ఫోటోలు, వీడియోలు వైరల్..

తాజాగా కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది.

Image Credits : Twitter

SSMB 29 Movie : మహేష్ బాబు – రాజమౌళి సినిమా లేట్ గా మొదలయిన శరవేగంగానే షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా లీకులు మాత్రం అప్పుడప్పుడు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఒడిశా లోని కోరాపుట్ జిల్లాలో అక్కడి అడవుల్లో జరుగుతుంది.

తాజాగా కోరాపుట్ లో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. దీంతో అక్కడ లోకల్ అధికారులు మూవీ టీమ్ ని కలిశారు. మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రాతో అక్కడి అధికారులు, అక్కడ పనిచేసిన వాళ్ళు ఫోటోలు, ఆటోగ్రాఫ్స్ తీసుకున్నారు.

Also Read : Mumait Khan : 15 రోజులు కోమాలోనే ఉన్నా.. మెమరీ లాస్ అయింది.. అందుకే ఇంత గ్యాప్..

దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. షూటింగ్ ఫోటోలు కాకపోయినా అక్కడ సెట్ లో మహేష్ ఫోటో రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

షూటింగ్ పూర్తి కావడంతో చివరి రోజు రాజమౌళి అక్కడ లోకల్ లో ఉన్న ప్రజలతో కలిసి వాలీబాల్ ఆడారు. వారికి ఫోటోలు ఇచ్చారు. దీంతో ఈ వీడియోలు, ఫోటోలు ఒడిశా టీవీ ఛానల్స్ టెలికాస్ట్ చేస్తున్నాయి.

తర్వాత షెడ్యూల్ మరి కొన్ని రోజుల్లో హైదరాబాద్ లోనే వేస్తున్న ఓ భారీ సెట్ లో జరగనుందని సమాచారం.