Mumait Khan : 15 రోజులు కోమాలోనే ఉన్నా.. మెమరీ లాస్ అయింది.. అందుకే ఇంత గ్యాప్..
ముమైత్ ఖాన్ ఇన్నాళ్లు ఎందుకు కనపడలేదు, తనకి ఏమైందో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Mumait Khan Revealed She Injured and Went to Coma
Mumait Khan : ఇప్పటికింకా నా వయసు.. అంటూ అప్పట్లో తెలుగు యువతలో క్రేజ్ తెచ్చుకుంది ముమైత్ ఖాన్. ఐటెం సాంగ్స్ తో, స్పెషల్ క్యారెక్టర్స్ తో తెలుగు, తమిళ్, హిందీ సినిమాలో కనిపించి బాగా పాపులర్ అయింది ముమైత్. ఆ తర్వాత పలు టీవీ షోలలో కూడా కనిపించింది. 2019 నుంచి మాత్రం అడపాదడపా షోలు, సినిమాలు చేస్తుంది.
2022 తర్వాత కొన్నాళ్ళు ఎవరికీ కనిపించని ముమైత్ ఇటీవలే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. హైదరాబాద్ లో మేకప్, హెయిర్ అకాడమీ ప్రారంభించింది ముమైత్. దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. ముమైత్ ఖాన్ ఇన్నాళ్లు ఎందుకు కనపడలేదు, తనకి ఏమైందో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ఇంట్లో డ్యాన్స్ వేస్తుంటే కాలు స్లిప్ అయి పడి నా బెడ్ కి తల తగిలి పడిపోయాను. బయటకి బ్లడ్ రాలేదు. కానీ లోపల ఏదో జరిగింది అని అర్ధమయింది. మా అమ్మ హాస్పిటల్ కి తీసుకెళ్లింది. డాక్టర్ సీరియస్ అన్నారు. మూడు నరాలు కట్ అయ్యాయి అని చెప్పారు. బాంబే హాస్పిటల్ లో సర్జరీ చేసారు. 15 రోజులు కోమాలో ఉన్నాను. 15 రోజుల తర్వాత కోమా నుంచి బయటకు వచ్చా. దాంతో కొంచెం మెమరీ లాస్ అయింది. చాలా విషయాలు మర్చిపోయాను. అవి గుర్తుకు చేసుకోవాలంటే చాలా ఒత్తిడి అనిపిస్తుంది. ఇప్పటికి కొన్ని విషయాలు గుర్తుకు రావు అని తెలిపింది. ప్రస్తుతం అయితే తన హెల్త్ కండిషన్ బానే ఉందని తెలిపింది.