Soniya Akula : నాగార్జున హోస్ట్‌గా ఉంటే మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళను.. హోస్ట్ మారాలి.. బిగ్ బాస్ భామ సోనియా ఆకుల సంచలన వ్యాఖ్యలు..
సోనియా ఆకుల 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గురించి, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Bigg Boss Fame Soniya Akula Sensational Comments on Nagarjuna
Soniya Akula : ఆర్జీవీ కాంపౌండ్ నుంచి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది సోనియా ఆకుల. ఆర్జీవీ ప్రొడక్షన్ లో ఆశ, కరోనా లాంటి పలు సినిమాలు, బయట కూడా అనేక సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. బిగ్ బాస్ 8 లోకి నటి సోనియా వచ్చి నాలుగు వారాలకే ఎలిమినేట్ అయింది. నటిగానే కాకుండా ఓ టూరిజం సంస్థలో పనిచేస్తుంది, ఓ ఎన్జీవో కూడా నడిపిస్తుంది.
బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక తన బాయ్ ఫ్రెండ్ యష్ ని పెళ్లి చేసుకుంది. సోనియా కీలక పాత్రలో నటించిన ఆర్టిస్ట్ సినిమా మార్చ్ 21న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 10 టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున గురించి, బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.
బిగ్ బాస్ భామ సోనియా ఆకుల మాట్లాడుతూ.. నాకు పర్సనల్ గా బిగ్ బాస్ కి మళ్ళీ వెళ్లాలని లేదు. కానీ జనాలకు అది దగ్గరకు చేస్తుంది. నేను 20 సినిమాలు చేసినా రాని గుర్తింపు నాకు బిగ్ బాస్ తో వచ్చింది. ఈసారి అయితే నాగార్జున సర్ హోస్ట్ గా ఉండొద్దు అనుకుంటున్నా. నాగ్ సర్ సాఫ్ట్ గా ఉంటారు. నాగ్ సర్ సరిగా మాట్లాడలేదు, చాలా పదాలు, మాటలు మార్చేశారు. నేను అనని వాటి గురించి కూడా తప్పుగా ప్రమోట్ చేసారు. బిగ్ బాస్ లో హోస్ట్ మేజర్ పాత్ర పోషిస్తారు. ఉన్నది లేనిది కలిపి మాట్లాడకూడదు హోస్ట్. నాగార్జున గారు చెవిలో ఉండే మైక్ లో ఏం చెప్తే అది చెప్తారు. ఆలోచించరు. నాగార్జున సర్ తప్పుకుంటే మంచిది. రానా గారు అయితే హోస్ట్ గా బాగా సరిపోతారు. రానా గారు కూడా చాలా షోలు చేసారు. ఆయన అప్డేట్ గా ఉంటారు. ఆయన అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారు అని నా అభిప్రాయం. నాగార్జున గారు హోస్ట్ ఉంటే నాకు మళ్ళీ ఛాన్స్ వస్తే నేను వెళ్ళను అంటూ గత బిగ్ బాస్ లో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ మాట్లాడింది. దీంతో సోనియా వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఈసారి హోస్ట్ నాగార్జుననే ఉంటారా లేక మారతారా చూడాలి.