Thaman : తమన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 9 ఏళ్ళ వయసులో బాలయ్య సినిమాకు.. అందుకే బాలయ్యతో అంత కనెక్షన్..?

తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి, మొదటి సినిమా రెమ్యునరేషన్ గురించి తెలిపాడు. 

Thaman : తమన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? 9 ఏళ్ళ వయసులో బాలయ్య సినిమాకు.. అందుకే బాలయ్యతో అంత కనెక్షన్..?

Do You Know Music Director Thaman First Remuneration at the age of 9 for Balakrishna Movie

Updated On : March 19, 2025 / 7:19 AM IST

Thaman : తమన్ అంటే బాలయ్య సినిమాకు అదరగొడతాడని అందరికి తెలుసు. ఇటీవల కొంతమంది నందమూరి తమన్ అని కూడా అనేంతగా బాలయ్య బాబుకి కనెక్ట్ అయ్యాడు. బాలయ్య కూడా తమన్ కి ఇటీవల ఖరీదైన కార్ గిఫ్ట్ ఇచ్చాడు. అంతలా తమన్ బాలయ్యకు నచ్చేసాడు. తాజాగా తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా గురించి, మొదటి సినిమా రెమ్యునరేషన్ గురించి తెలిపాడు.

తమన్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను ఫస్ట్ పనిచేసింది బాలకృష్ణ గారి భైరవ ద్వీపం సినిమాకు. ఆ సినిమాకు డ్రమ్మర్ గా పనిచేసాను. మా నాన్న గారు తీసుకెళ్లారు. దానికి ఫస్ట్ టైం 30 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాను. ఇది 9 ఏళ్ళ వయసులో చేశాను. అక్కడ ఉన్న సీనియర్ వర్కర్స్ తో సమానంగా వర్క్ చేశాను అని తెలిపాడు. తమన్ మొదటి సినిమా బాలయ్యతో కాబట్టే తమన్ కి బాలయ్యకి అంత కనెక్షన్ ఏర్పడింది, బాలయ్య అంటే తమన్ ఎక్కువ అభిమానం చూపిస్తాడు అని ఫ్యాన్స్, నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం తమన్ ఒక్కో సినిమాకు సినిమా రేంజ్ ని బట్టి 2 నుంచి 5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

Also Read : Anchor Suma Mother : టీవీ షోలో సుమ తల్లి.. సుమ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసి.. ప్రోమో వైరల్..

తమన్ తండ్రి శివకుమార్ సినిమా ఇండస్ట్రీలోనే మ్యూజిక్ డైరెక్టర్స్ వద్ద డ్రమ్మర్ గా పనిచేసేవారు. చాలా సినిమాలకు ఆయన డ్రమ్మర్ గా పనిచేసారు. శివ కుమార్ డ్రమ్మర్ కావడంతో చిన్నప్పట్నుంచి తమన్ కి కూడా అందులో శిక్షణ ఇచ్చి తమన్ ని కూడా డ్రమ్మర్ గా, రిథమ్ ప్లేయర్ గా తయారుచేసారు. అయితే తమన్ కి 11
ఏళ్ళ వయసులోనే తండ్రి శివకుమార్ చనిపోయారు. అప్పట్నుంచే మ్యూజిక్ రంగంలో కష్టపడుతూ ఇవాళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు.