Anchor Suma Mother : టీవీ షోలో సుమ తల్లి.. సుమ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసి.. ప్రోమో వైరల్..
తాజాగా సుమ తల్లి విమల సుమ అడ్డా టీవీ షోకి హాజరైంది.

Anchor Suma Mother Attends to Suma Adda TV Show for Suma Birthday Celebrations
Anchor Suma Mother : యాంకర్ సుమ తన యాంకరింగ్ తో తెలుగువారిళ్ళల్లో ఒకరిగా అయిపొయింది. అనేక టీవీ షోలతో మెప్పించిన సుమ కనకాల ప్రస్తుతం సుమ అడ్డా అనే ఒకే టీవీ షో చేస్తుంది. తన యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో పలు వీడియోలు చేస్తుంది. యాంకర్ సుమ గతంలో పలు మార్లు వాళ్ళ అమ్మ గురించి ఫొటోలు, వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా సుమ తల్లి విమల సుమ అడ్డా టీవీ షోకి హాజరైంది. మార్చ్ 22న యాంకర్ సుమ పుట్టిన రోజు. రీసెంట్ గా రిలీజ్ చేసిన సుమ అడ్డా ప్రోమోలో సుమ పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసారు. ఈ వేడుకలకు సుమ తల్లి హాజరయి సుమతో కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్ డే సుమ అని చెప్పింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.
ఇంకేమైనా మాట్లాడిందా తెలియాలి అంటే ఎపిసోడ్ చూసేయాల్సిందే. సుమ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సుమ అడ్డా ఎపిసోడ్ మార్చ్ 23 ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ఈటీవీలో టెలికాస్ట్ కానుంది. మీరు కూడా సుమ అడ్డా ప్రోమో చూసేయండి..