Akkineni Nageswara Rao : వాట్.. అక్కినేని నాగేశ్వరరావు ఆ హీరోని దత్తత తీసుకున్నారా? ఆసక్తికర విషయం బయటపెట్టిన హీరో..

అక్కినేని నాగేశ్వరరావు ఒకర్ని దత్తత తీసుకున్నారట. తాజాగా ఓ హీరో ఈ విషయాన్ని ప్రకటించాడు.

Akkineni Nageswara Rao : వాట్.. అక్కినేని నాగేశ్వరరావు ఆ హీరోని దత్తత తీసుకున్నారా? ఆసక్తికర విషయం బయటపెట్టిన హీరో..

Akkineni Nageswara Rao Adopted a Hero Revealed by him Self in TV Show

Updated On : March 18, 2025 / 10:03 PM IST

Akkineni Nageswara Rao : తెలుగు సినీ పరిశ్రమ తొలినాళ్లలో స్టార్ హీరోగా, సినీ పరిశ్రమకు ఒక కన్నుగా నిలిచిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. ఆ తర్వాత ఆయన కుటుంబం నుంచి అనేకమంది హీరోలు, నిర్మాతలు వచ్చారు. టాలీవుడ్ అగ్ర కుటుంబాలలో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని నాగేశ్వరరావుకు నాగార్జున కాకుండా ఇంకో కొడుకు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

అయితే అక్కినేని నాగేశ్వరరావు మరొకర్ని దత్తత తీసుకున్నారట. తాజాగా ఓ హీరో ఈ విషయాన్ని ప్రకటించాడు. ఇంతకు ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా? అక్కినేని నాగేశ్వరరావు మనవడు, హీరో సుమంత్. అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కూతురు సత్యవతి – యార్లగడ్డ సురేంద్రల కొడుకు సుమంత్ యార్లగడ్డ. సుమంత్ ని అక్కినేని నాగేశ్వరరావు దత్తత తీసుకున్న విషయం సుమంత్ స్వయంగా తెలిపాడు.

Also Read : Thaman : ‘గేమ్ ఛేంజర్’లో హుక్ స్టెప్స్ లేవు.. డ్యాన్స్ మాస్టర్స్ వల్లే.. అలవైకుంఠపురంలో అయితే.. తమన్ సంచలన వ్యాఖ్యలు..

సుమంత్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోకి గెస్ట్ గా వచ్చారు. తాజాగా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. ఈ షోలో ఫాదర్స్ గురించి ప్రస్తావన రాగా సుమంత్ మాట్లాడుతూ.. నాకు ఇద్దరు ఫాదర్స్ ఉన్నారు. నా బర్త్ ఫాదర్ సురేంద్ర. మా తాత గారు అక్కినేని నాగేశ్వర రావు గారు నన్ను దత్తత తీసుకున్నారు. ప్రాక్టికల్ గా అయితే ఆయనే నా ఫాదర్ అని తెలిపారు. ఈ విషయం తెలియడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. కొడుకులు, కూతుళ్లు ఉన్నా సుమంత్ ని నాగేశ్వరరావుని దత్తత తీసుకోవడం గమనార్హం. ఈ షో ప్రోమో మీరు కూడా చూసేయండి…

సుమంత్ తండ్రి సురేంద్ర యార్లగడ్డ కూడా నిర్మాతగా పలు సినిమాలు నిర్మించారు. సుమంత్ ప్రేమకథ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా ఆ తర్వాత యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావా.. ఇలా అనేక సినిమాలతో మంచి హిట్స్ కొట్టాడు. ప్రస్తుతం సుమంత్ ఓ పక్క హీరోగా చేస్తూనే పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేస్తున్నాడు. త్వరలో అనగనగా అనే ఓటీటీ సినిమాతో రానున్నాడు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరోయిన్, నిర్మాత సుప్రియ యార్లగడ్డ సుమంత్ కి సోదరి అవుతుంది.

Akkineni Nageswara Rao Adopted a Hero Revealed by him Self in TV Show