Thaman : ‘గేమ్ ఛేంజర్’లో హుక్ స్టెప్స్ లేవు.. డ్యాన్స్ మాస్టర్స్ వల్లే.. అలవైకుంఠపురంలో అయితే.. తమన్ సంచలన వ్యాఖ్యలు..
తాజాగా గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాలో సాంగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.

Thaman Sensational Comments on Ram Charan Game Changers Songs and Dance Masters
Thaman : రామ్ చరణ్ ఇటీవల సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పుడో 2021లో ఈ సినిమా అనౌన్స్ చేసినా శంకర్ మధ్యలో భారతీయుడు 2 షూట్ కి వెళ్లిపోవడంతో ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. సినిమా కూడా పాత కథతో ఉండటంతో చరణ్ యాక్టింగ్ తో అదరగొట్టినా, సినిమా సంక్రాంతికి వచ్చినా యావరేజ్ గా నిలిచింది.
సినిమాలో సాంగ్స్ కూడా మరీ అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఒక్క హైరానా సాంగ్ తప్ప మిగిలినవి ఏవీ లూప్ మోడ్ లో వినేలా లేవని ఫ్యాన్స్ సైతం అన్నారు. ఇక యూట్యూబ్ లో వ్యూస్ విషయంలో కూడా వందల మిలియన్స్ వ్యూస్ రాలేదు. అయితే తాజాగా గేమ్ ఛేంజర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాలో సాంగ్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అది కూడా అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సినిమాతో కంపేర్ చేస్తూ మాట్లాడటంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో యూట్యూబ్ వ్యూస్ గురించి ప్రశ్న ఎదురవ్వగా తమన్ సమాధానమిస్తూ.. యూట్యూబ్ వ్యూస్ కి మ్యూజిక్ డైరెక్టర్ తో పాటు అన్ని అంశాలు పరిగణలోకి వస్తాయి. హుక్ స్టెప్స్ కూడా ఎక్కువ వ్యూస్ రావడానికి రీజన్ అవుతాయి. గేమ్ ఛేంజర్ సినిమాలో హుక్ స్టెప్స్ లేవు. జరగండి జరగండి, రా మచ్చ, హైరానా సాంగ్స్, దోప్.. ఇలా ఏ సాంగ్స్ లో కూడా హుక్ స్టెప్స్ లేవు. డ్యాన్స్ వేసే స్టెప్స్ లేవు. అలవైకుంఠపురంలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ కి హుక్ స్టెప్స్ ఉన్నాయి. రాములో రాములా, బుట్టబొమ్మ, సామజవరగమన.. ఇలా అన్ని సాంగ్స్ కి హుక్ స్టెప్స్ ఉన్నాయి. డ్యాన్స్ మాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. హుక్ స్టెప్స్ స్ట్రాంగ్ గా లేకపోతే కంటిన్యూగా పాటలు వినలేరు. గేమ్ ఛేంజర్ సాంగ్స్ బాగున్నా రీల్స్ చేసే వాళ్ళు, డ్యాన్స్ చేసే వాళ్లకు హుక్ స్టెప్స్ లేకపోవడంతో ఎక్కువ వ్యూస్ రాలేదు అని అన్నారు.
అలాగే.. శంకర్ సర్ అడగడంతో ఈ సాంగ్స్ ని 2021 లోనే రెడీ చేసేసాను. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత అవి పాతవి అయిపోయినట్టు అనిపిస్తాయి. అప్పటికి కాస్త రీ రికార్డింగ్ లో చేంజ్ చేశాను అని కూడా తమన్ తెలిపాడు. దీంతో తమన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. డైరెక్ట్ గా నేను సాంగ్స్ బాగానే ఇచ్చినా డ్యాన్స్ మాస్టర్స్ ఈ సాంగ్స్ కి హుక్ స్టెప్స్ ఇవ్వలేదు అందుకే ఆశించినంత రీచ్ రాలేదు అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు చర్చగా మారాయి. మరి దీనిపై గేమ్ ఛేంజర్ యూనిట్ కానీ, డ్యాన్స్ మాస్టర్స్ కానీ స్పందిస్తారా చూడాలి. అసలే గేమ్ ఛేంజర్ సినిమాకు ఒక్కో పాటకు ఒక్కో డ్యాన్స్ మాస్టర్ పనిచేసారు.