Jabardasth Varsha : జబర్దస్త్ ‘వర్ష’ టీవీ షోలు మానేస్తుందా? లేక ఇమ్మాన్యుయేల్? ‘ఇమ్ము’ని హగ్ చేసుకొని ఏడ్చేసిన వర్ష..

ఇమ్ము - వర్ష జంటకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

Jabardasth Varsha : జబర్దస్త్ ‘వర్ష’ టీవీ షోలు మానేస్తుందా? లేక ఇమ్మాన్యుయేల్? ‘ఇమ్ము’ని హగ్ చేసుకొని ఏడ్చేసిన వర్ష..

Jabardasth Varsha and Emmanuel Emotional Promo goes Viral

Updated On : March 18, 2025 / 7:55 PM IST

Jabardasth Varsha : సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ సీరియల్ నటిగా పాపులారిటీ తెచ్చుకున్న వర్ష జబర్దస్త్ లోకి వచ్చాక బాగా ఫేమస్ అయింది. జబర్దస్త్ లో స్కిట్స్ తో, ఇమ్మాన్యుయేల్ తో కలిసి కామెడీ, లవ్ ట్రాక్స్, బయట ఈవెంట్స్ తో, తన సోషల్ మీడియా ఫొటోలతో జబర్దస్త్ వర్ష బాగా పాపులర్ అయింది.

జబర్దస్త్ లో టీఆర్పీ రేటింగ్స్ కోసం సుధీర్ – రష్మీలను జంటగా చూపించి ఎన్ని స్కిట్స్ చేశారో, వర్ష – ఇమ్మాన్యుయేల్ ని కూడా అలాగే చూపించి లవ్ ట్రాక్స్ తో స్కిట్స్ వేశారు. వీళ్ళిద్దరూ నిజంగానే లవర్స్ అన్న రేంజ్ లో టీవీ షోలలో పర్ఫార్మ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, పలు టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపిస్తుంది.

Also Read : NTR Song – Thaman : ఎన్టీఆర్ సాంగ్ నా కెరీర్లోనే టఫ్ సాంగ్.. అది విని మా అమ్మ ఏడ్చేసింది.. చిన్నప్పటి అనుభవాలతో ఆ పాట..

అయితే తాజాగా రిలీజ్ చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో.. యాంకర్ రష్మీ వర్షని ఇదే ఇమ్ముతో నీ చివరి పర్ఫార్మెన్స్ అనుకోవచ్చా అని అడిగింది. దీంతో వర్ష ఎమోషనల్ అయి.. ఇమ్ము ఇక్కడ ఎంతమంది ఉన్నా నువ్వు లేకపోతే బాగోదు అంటూ వెళ్లి ఇమ్ముని హగ్ చేసుకొని ఏడ్చేసింది. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమో చూసి వర్ష టీవీ షోలు మానేస్తుందా? లేక జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ మానేస్తుందా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. లేదా ఇమ్మాన్యుయేల్ మానేస్తున్నాడా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఇమ్ము – వర్ష జంటకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఈ ప్రోమో చూసి ఈ జంట ఫ్యాన్స్ ఏమైంది? మళ్ళీ ఇద్దరు కలిసి స్కిట్స్ చేయరా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏమైందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. ఈ ఎపిసోడ్ మార్చ్ 23 న ఈటీవీలో మధ్యాహ్నం 1 గంటకు టెలికాస్ట్ అవ్వనుంది.

మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..