NTR Song – Thaman : ఎన్టీఆర్ సాంగ్ నా కెరీర్లోనే టఫ్ సాంగ్.. అది విని మా అమ్మ ఏడ్చేసింది.. చిన్నప్పటి అనుభవాలతో ఆ పాట..
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ ఓ పాట విషయంలో బాగా కష్టపడ్డాను అని, తన కెరీర్లోనే అది టఫ్ సాంగ్ అని, ఆ సాంగ్ విని వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది అని చెప్పాడు.

Thaman Mother Cried after Listening NTR Movie Song
NTR Song – Thaman : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎన్నో సినిమాలో అద్భుతమైన సాంగ్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. తమన్ అంటే అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే కాదు మంచి సాంగ్స్ కూడా. తమన్ ఎన్నో సినిమాల్లో మంచి మెలోడీ సాంగ్ , ఎమోషనల్ సాంగ్స్, ప్రేమ పాటలు కూడా ఇచ్చాడు.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమన్ ఓ పాట విషయంలో బాగా కష్టపడ్డాను అని, తన కెరీర్లోనే అది టఫ్ సాంగ్ అని, ఆ సాంగ్ విని వాళ్ళ అమ్మ కూడా ఏడ్చింది అని చెప్పాడు.
తమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమాలోని ‘పెనిమిటి..’ సాంగ్ నాకు టఫెస్ట్ సాంగ్ కెరీర్ లోనే. ఆ సాంగ్ కోసం మా అమ్మ దగ్గర నుంచి చాలా ఇన్ పుట్స్ తీసుకున్నాను. మా అమ్మని ఊహించుకొని సాంగ్ చేశాను. ఆ పాటలో నాన్న కోసం ఎదురుచూసే అమ్మ ఎమోషన్ ఉండాలి. మా నాన్న సేఫ్ గా రావాలి అని బాల్కనీలో నిల్చొని ఎదురుచూసేది అమ్మ. అప్పుడు నేను ఎందుకు అమ్మ అలా నిల్చొని చూస్తుంది అనుకునేవాడిని. ఆ అనుభవాలు అన్ని ఈ సాంగ్ లో నాకు ఉపయోగపడ్డాయి. మా అమ్మ వంట చేసేటప్పుడు ఆ సాంగ్ వినిపించాను. అది విని మా అమ్మ ఏడ్చింది. మా నాన్నని తలుచుకొని ఏడ్చేసింది. మా నాన్న కోసం అలాగే ఎదురుచూసేది అని చెప్పింది. అప్పుడు సాంగ్ లో ఎమోషన్ కనెక్ట్ అయింది అనుకున్నా. ఆ తర్వాత త్రివిక్రమ్ సర్, ఎన్టీఆర్ సర్ కి వినిపించా. వాళ్లకు కూడా నచ్చింది. అమ్మ ఎమోషన్ అనేది ఎప్పుడూ నిజం. వేరే ఎమోషన్స్ అన్ని తర్వాత వస్తాయి, కానీ అమ్మ ఎమోషన్ పుట్టినప్పటి నుంచి ఉంటుంది. త్రివిక్రమ్ గారు చాలా బాగుంది ఎలా చేసావు అని అడిగితే నా అనుభవాల నుంచి వచ్చింది సర్ అన్నాను అని తెలిపాడు.