Mahesh Babu – Ram Charan : పెట్స్ ప్రేమలో పడిపోతున్న హీరో హీరోయిన్లు..
టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్లు పెట్స్ ప్రేమలో పడుతున్నారు. రామ్ చరణ్, మహేష్ బాబు, కీర్తి సురేష్, సమంత..
- gum 95921
- Updated on- April 13, 2023 / 01:40 PM IST
Mahesh Babu Ram Charan Keerthy Suresh Samantha with pets
Mahesh Babu – Ram Charan : మూవీ సెలబ్రేటిస్ అంతా పెట్స్ ప్రేమలో పడుతున్నారు. రామ్ చరణ్, మహేష్ బాబు, కీర్తి సురేష్, సమంత.. ఇలా స్టార్ హీరో హీరోయిన్లు పెట్స్ ప్రేమకి ఫిదా అవుతున్నారు. టాలీవుడ్ రామ్ చరణ్ (Ram Charan) ఎక్కువుగా పెట్స్ తో కనిపిస్తుంటాడు. తను ఎక్కడికి వెళ్లిన తన వెంటే తన పెట్ రైమ్ (Rhyme) ని కూడా తీసుకు వెళ్తుంటాడు. అంతేకాదు రైమ్ పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా రన్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఇక ఈ రైమ్ కి చరణ్ అభిమానుల్లో మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది.
Ram Charan : చిరుత కాదు చిట్టెలుక.. రామ్ చరణ్ గురించి బలగం ఫేమ్ నటుడు కామెంట్స్..
ఇటీవల చరణ్ అండ్ ఉపాసనతో కలిసి దుబాయ్ వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేసిన రైమ్.. ఆ తరువాత మాల్దీవ్స్ టూర్ కి వెళ్ళలేదు. తాజాగా చరణ్ మాల్దీవ్స్ నుంచి తిరిగి రాగ.. వెల్కమ్ చెప్పడానికి రైమ్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో చరణ్ ని చూసిన రైమ్ సంతోషంతో ఉరకలేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. ఇది ఇలా ఉంటే, సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా మొదటిసారి తన పెట్ తో కనిపించాడు. ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఉన్న మహేష్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ షేర్ చేశాడు.
Rajamouli – Mahesh Babu : రాజమౌళి సినిమాలో మహేష్ హనుమంతుడి పాత్ర.. అమెజాన్ అడవుల్లో సాహసం!
ఆ పిక్ లో మహేష్ పిల్లి పిల్లని ఎత్తుకొని దాని వైపు ప్రేమగా చూస్తున్నాడు. ఈ పోస్ట్ కి My Kleo అనే కామెంట్ పెట్టాడు. ఇక ఈ పిక్ లో మహేష్ లుక్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అలాగే కీర్తి సురేష్ (Keerthy Suresh) తన పెట్ తో ఆడుతున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల దసరా మూవీ షూటింగ్ గ్యాప్ లో తన పెట్ తో ఆడుతున్న వీడియో బయటకి వచ్చి వైరల్ అయ్యింది. తాజాగా సమంత (Samantha) కూడా శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో తన పెట్స్ కలిసి సందడి చేస్తుంది.
