Ram Charan : చిరుత కాదు చిట్టెలుక.. రామ్ చరణ్ గురించి బలగం ఫేమ్ నటుడు కామెంట్స్..
బలగం సినిమాలో నటించిన మురళీధర్ గౌడ్, రామ్ చరణ్ పై వైరల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Balagam fame Muralidhar Goud viral comments on Ram Charan
Ram Charan : ఇటీవల రీజినల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాల్ని అందుకొని సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా చిన్న సినిమాగా ఆడియన్స్ ముందుకు వచ్చిన చిత్రం బలగం (Balagam). జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలిచింది. దిల్ రాజు సమర్పణలో దిల్ రాజు తనయులు హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించగా రచ్చ రవి, రోహిణి, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
Ram Charan – Manchu Manoj : మంచు మనోజ్‌కి స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్.. ఏంటో తెలుసా?
ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో ఈ చిత్ర నటీనటులు, టెక్నీషియన్స్ పలు ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మురళీధర్ గౌడ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామ్ చరణ్ (Ram Charan) పై వైరల్ కామెంట్స్ చేశాడు. మా ఆఫీస్ లో పని చేసే ఒక మహిళ చిరంజీవికి అభిమాని. ఇక ఆయన కొడుకు రామ్ చరణ్ మొదటి సినిమా రిలీజ్ రోజున బ్యాంకు పని ఉందని అబద్దం చెప్పి పర్మిషన్ అడిగి చిరుత సినిమాకి వెళ్లి వచ్చింది. ఆ విషయాన్ని నేను గమనించి ఆమెను సినిమా ఎలా ఉంది మేడం అంటూ ప్రశ్నించినట్లు చెప్పుకొచ్చాడు.
అయితే దానికి ఆమె బదులిస్తూ.. ఏమి సినిమా సార్ అది. చిరుత అని పేరు పెట్టుకున్నాడు గాని చిట్టెలుకలా కూడా లేడు అంటూ చెప్పుకొచ్చినట్లు మురళీధర్ వెల్లడించాడు. ఇక ఆమె వ్యాఖ్యలు పై మురళీధర్ ఇప్పుడు స్పందిస్తూ.. అప్పుడు రామ్ చరణ్ పై ప్రజల్లో అలాంటి అభిప్రాయం ఉండేది. కానీ నేడు ఏ స్టేజిలో ఉన్నాడు. నటుడిగా ఎంతో ఎదిగాడు. అందుకోసం తనని తాను ఎంతో మార్చుకున్నాడు అంటూ ప్రశంసించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.