Mahesh Babu : ఖలేజా మూవీ సీన్‌ని.. నమ్రతతో రీ క్రియేట్ చేసిన మహేష్.. ఫోటో వైరల్..

ఖలేజా మూవీ సీన్‌ని భార్య నమ్రతతో కలిసి రీ క్రియేట్ చేసిన మహేష్ బాబు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.

Mahesh Babu re create khaleja movie scene with his wife namrata

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉంటున్నారు. ఈక్రమంలోనే తనకి సంబంధించిన విషయాలన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మహేష్ సోషల్ మీడియాలో ఇంత యాక్టీవ్ గా ఉండడంతో బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి వస్తున్నారు. కాగా మహేష్ తాజాగా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ.. ఓ పిక్ షేర్ చేశారు.

ఆ ఫొటోలో మహేష్, నమ్రతని ప్రేమతో కౌగిలించుకొని ముద్దాడుతున్నారు. ఇక ఈ పిక్‌ చూసిన నెటిజెన్స్.. ఓ విషయాన్ని కనిపెట్టారు. ఖలేజా సినిమాలోని ఓ సీన్ ని మహేష్ బాబు రీ క్రియేట్ చేశారని చెబుతున్నారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. ఖలేజా సెకండ్ హాఫ్ లో మహేష్ బ్రహ్మానందం ఇంటికి వెళ్లారు. ఇక అక్కడ హీరోయిన్ అనుష్క ఏడుస్తుంటే.. మహేష్ ఆమెను ఓదారుస్తారు.

Also read : Salaar : సలార్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి..? ఇప్పటివరకు ఎంత వచ్చాయి..?

ఆ సీన్ లో మహేష్, అనుష్క స్టిల్, ఇప్పుడు నమ్రతతో మహేష్ షేర్ చేసిన స్టిల్ కూడా ఇంచుమించు అలానే ఉంది. దీంతో మహేష్ అభిమానులు.. ఖలేజా ఫొటోతో ఈ పిక్ ని జత చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. కాగా మహేష్ బాబు ఓ యాడ్ షూట్ కోసం రీసెంట్ గా దుబాయ్ వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని కూడా అక్కడే చేసుకోవడానికి ఫ్యామిలీని కూడా తీసుకు వెళ్లారు. ఈ పిక్ దుబాయ్‌లోనిదే.

ఇక గుంటూరు కారం విషయానికి వస్తే.. రీసెంట్ గా రిలీజ్ చేసిన కుర్చీ మడత పెట్టి సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఓ ఊపు ఊపేస్తోంది. ఈ పాటకి శ్రీలీలతో కలిసి మహేష్ వేసిన డాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం జనవరి 12న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ కలెక్షన్స్ పై నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. రాజమౌళి సినిమా కలెక్షన్స్ దగ్గరకి వెళ్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.