Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్-1’ టీజర్‌ను వదిలిన మహేష్!
తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ను ఎట్టకేలకు దృశ్యకావ్యంగా మలుస్తున్నాడు. ఇప్పటికే తొలిభాగం సినిమా షూటింగ్ పూర్తి.....
- Anil Aaleti
- Published On : July 8, 2022 / 07:30 PM IST
Mahesh Babu Releases Ponniyin Selvan 1 Telugu Teaser
Ponniyin Selvan: తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘పొన్నియన్ సెల్వన్’ను ఎట్టకేలకు దృశ్యకావ్యంగా మలుస్తున్నాడు. ఇప్పటికే తొలిభాగం సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘పొన్నియిన్ సెల్వన్’ నుండి గతకొద్ది రోజులుగా వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ తెగ హల్‌చల్ చేస్తున్నారు మణిరత్నం అండ్ టీమ్. అత్యంత భారీ బడ్జెట్‌తో, భారీ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోంది.
Ponniyin Selvan: మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ టీజర్ డేట్ ఫిక్స్..?
ఇక ఈ సినిమా నుండి తాజాగా టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పొన్నియన్ సెల్వన్-1 చిత్ర తెలుగు టీజర్‌ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దాడు మణిరత్నం. మనకు ఈ టీజర్ చూస్తున్నంతసేపు బాహుబలి గుర్తుకు రావడం ఖాయం. ఆ రేంజ్‌లో ఈ సినిమాలో భారీ యుద్ధం సన్నివేశాలను మనకు చూపించేందుకు మణిరత్నం సిద్ధమవుతున్నారు. ఇక 10వ శతాబ్దంలో చోళరాజుల కాలానికి సంబంధించిన కథతో ఈ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాను తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.
Ponniyin Selvan: మణిరత్నం PS-1కు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్?!
ఈ సినిమాలో విక్రమ్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా, కార్తి, త్రిష, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ప్రకాశ్ రాజ్, జయం రవి, జయరాం, ప్రభు, శరత్ కుమార్, పార్తీబన్ వంటి స్టార్స్ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో క్రియేట్ అయ్యాయి. తనకు ఎంతో ఇష్టమైన దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ టీజర్‌ను రిలీజ్ చేయడం తనకు ఎంతో సంతోషంగా ఉందని మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తుండగా, ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
