Ponniyin Selvan: మణిరత్నం PS-1కు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్?!

లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.

Ponniyin Selvan: మణిరత్నం PS-1కు కళ్ళు చెదిరే ఓటీటీ డీల్?!

Ponniyin Selvan

Ponniyin Selvan: లెజెండరీ దర్శకుడు మణిరత్నం భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న పీరియాడికల్ మూవీ ‘పొన్నియన్ సెల్వన్’. ప్రసిద్ధ రచయిత కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. చోళుల కాలం నాటి కథాంశంతో తీస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే ఈ చిత్రంలో విక్రమ్-కార్తీ-జయం రవి-విక్రమ్ ప్రభు.. ఐశ్వర్యారాయ్-త్రిష-శోభితా ధూళిపాళ్ల-ఐశ్వర్య లక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ponniyin Selvan : డెడికేషన్.. గాయంతోనే షూటింగ్‌కి ప్రకాష్ రాజ్..

ఆదిత్య కరికాలన్ గా విక్రమ్, పొన్నియిన్ సెల్వన్ గా జయం రవి, వల్లవ రాయన్ వంద్యదేవన్ గా కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వర్యారాయ్ ద్విపాత్రాభినయం, కుండవై పిరట్టియార్ గా త్రిష తదితర క్రేజీ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను మణిరత్నం దాదాపు 500 వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Ponniyin Selvan : మణిరత్నం విజువల్ వండర్ ఫస్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడంటే..

కాగా.. ఇప్పుడు ఈ సినిమాకు ఓ ఓటీటీ సంస్థ కళ్ళు చెదిరే ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకోగా.. అందుకు గాను ఏకంగా 125 కోట్ల రూపాయలను నిర్మాతకు చెల్లించేందుకు ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. ఒక తమిళ సినిమాకు ఈ స్థాయిలో బిజినెస్ జరగడం ఇదే కాగా.. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమా కావడం.. భారీ స్టార్ క్యాస్టింగ్ ఉండడం.. మణిరత్నం లాంటి దర్శకుడు కావడంతోనే ఈ భారీ అఫర్ దక్కినట్లు తెలుస్తుంది. అయితే.. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.