ఫ్యామిలీ ఫ్యామిలీ దిగిపోయారుగా : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా!

సూపర్ స్టార్ మహేష్ బాబు మొట్టమొదటిసారి భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు..

  • Published By: sekhar ,Published On : October 24, 2019 / 05:17 AM IST
ఫ్యామిలీ ఫ్యామిలీ దిగిపోయారుగా : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా!

Updated On : October 24, 2019 / 5:17 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మొట్టమొదటిసారి భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఓ యాడ్‌లో నటించాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ దీపావళిని తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకోమంటున్నాడు.. ఇన్నాళ్లూ సోలోగా యాడ్స్ చేసిన మహేష్.. ఫస్ట్ టైమ్ ఫ్యామిలీతో కలిసి ఓ కమర్షియల్‌లో నటించాడు.. సాయిసూర్య డెవలపర్స్ వారి కొత్త యాడ్‌లో మహేష్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి సందడి చేశాడు.

‘మీ ప్రేమతో మీరు నన్ను సూపర్ స్టార్‌ని చేశారు.. కానీ, నేను కూడా మీలో ఒకణ్ణి.. మీ అందరిలాగే నాక్కూడా నా ఫ్యామిలీనే నా లైఫ్ లైన్.. నా ఇల్లే నా ప్రపంచం.. నా వాళ్లనుకునే మీ అందరికీ నేనిచ్చే సలహా.. ఫర్ ట్రస్ట్ అండ్ వాల్యూ.. సాయిసూర్య డెవలపర్స్’.. అంటూ మహేష్ ఫ్యామిలీతో కలిసి నటించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : ‘ఖాకీ వేస్తే పోలీస్, తీస్తే రౌడీ’ : దబంగ్ 3 ట్రైలర్

మహేష్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా అప్‌డేట్ దీపావళికి రానుండగా.. సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12న సినిమా విడుదల కానుంది.