Mahesh Babu : ‘గుంటూరు కారం’ నా లాస్ట్ తెలుగు సినిమా కావొచ్చు.. మహేష్ షాకింగ్ కామెంట్స్..

'గుంటూరు కారం' తన లాస్ట్ సినిమా కావొచ్చు అంటూ మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్ చేశారు.

Mahesh Babu : మహేష్ బాబు ‘గుంటూరు కారం’ సినిమా ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మదర్ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. కాగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా కన్నుల పండగ అయ్యింది. మూవీలోని మహేష్ క్యారక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్, స్లాంగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ మూవీ మహేష్ చేసిన డాన్సులు విజుల్స్ వేయించాయి.

ఈ విషయం గురించే మహేష్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
“సినిమా మొదలు పెట్టినప్పుడే నేను త్రివిక్రమ్ అయితే ఒక విషయం గట్టిగా అనుకున్నాము. ఈ సినిమాలో ఓ రెండు పాటలు అయినా గట్టిగా చేద్దామని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే.. ఈ సినిమా తరువాత నేను మళ్ళీ రీజినల్ సినిమా చేసే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇదే నా చివరి తెలుగు సినిమా కావొచ్చు. కాబట్టి మళ్ళీ మన తెలుగు మాస్ సాంగ్స్ కి డాన్స్ చేసే అవకాశం ఉంటుందో లేదో కూడా తెలియదు.

Also read : Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో మహేష్ కాల్చింది.. బీడీలు కాదంట.. మరేంటివి..?

అందుకనే ఈ మూవీ డాన్స్ వేయాలని నిర్ణయించుకున్నాము. దానికి తగ్గట్టే మూవీలోని మొదటి సాంగ్ అండ్ లాస్ట్ సాంగ్ ని ప్లాన్ చేశాము. అలాగే సెకండ్ హాఫ్ లో గో‌డౌన్‌లో ఒక సాంగ్ బిట్టు వస్తుంది. నెక్లీస్ గొలుసు సాంగ్ చేద్దామని కూడా ముందే ఫిక్స్ అయ్యాయి. దానికి తగ్గట్టు ముందుకు ఓ రెండు సాంగ్స్ పెట్టి డిజైన్ చేశాము. మొదటిలో చేసేద్దాం ఏముంది అనుకున్నాను. కానీ షూటింగ్ టైంకి ఈ అమ్మాయితో ఎలా చేయాలని కొంచెం టెన్షన్ పడ్డాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో.. గుంటూరు కారం మూవీలో చిరంజీవి రిఫరెన్స్ తో చెప్పే డైలాగ్ తనకెంతో ఫేవరెట్ అని చెప్పుకొచ్చారు. ఈ సినిమాలోని పోలీస్ స్టేషన్ సన్నివేశంలో మహేష్ బాబు మాట్లాడుతూ.. “నేను చిరంజీవి టైపు. నాకు ఎవరు లేరు. స్వయంకృషిలో చిరంజీవిలా సొంతంగా పైకి ఎదిగాను” అంటూ చెప్పుకొస్తారు. మహేష్ నుంచి చిరంజీవి పేరు రావడంతో థియేటర్ లో ఈ డైలాగ్ కి రీసౌండ్ వచ్చింది.

ట్రెండింగ్ వార్తలు