Guntur Kaaram : ‘గుంటూరు కారం’లో మహేష్ కాల్చింది.. బీడీలు కాదంట.. మరేంటివి..?
'గుంటూరు కారం'లో మహేష్ కాల్చింది బీడీలు కాదంట. బీడీల వెనుక ఉన్న అసలు నిజం అభిమానులకు తెలియజేసిన మహేష్.

Mahesh Babu reveals secret behind smoking scene in Guntur Kaaram movie
Guntur Kaaram : త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’.. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. అమ్మ సెంటిమెంట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న చిత్రంలో మహేష్ బాబు పాత్ర యూత్ ని బాగా ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహేష్ గుంటూరు కారం స్టైల్ గా బీడీ కాల్చే మ్యానరిజమ్స్ ఆకట్టుకుంటున్నాయి.
అయితే కొంతమంది మాత్రం మహేష్ బీడీ కలుస్తూ.. బ్యాడ్ హ్యాబిట్ ని ప్రమోట్ చేస్తున్నారా..? అనే ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా వీటికి చెక్ పెడుతూ మహేష్.. బీడీల గురించి ఓ నిజం బయట పెట్టారు. అవి అసలైన బీడీలు కాదట. మహేష్ బాబుకి అసలు స్మోకింగ్ అలవాటు లేదంట. అలాగే స్మోకింగ్ ని ఎంకరేజ్ చేయడం కూడా ఇష్టం లేదని పేర్కొన్నారు. అందుకనే బీడీల వెనుక ఉన్న అసలు నిజం అభిమానులకు తెలియజేశారు.
Also read : Mahesh Babu : నాలో ఆ టాలెంట్ ఉంది.. ఒక రెండు గంటలు ఒకరితో మాట్లాడితే చాలు..
సినిమా షూటింగ్ సమయంలో రియల్ బీడీని ఇచ్చారంట. అది కాల్చిన వెంటనే మహేష్ కి విపరీతంగా తలనొప్పి వచ్చేసిందట. ఇక ఆ బీడీలు కాల్చడం తన వల్ల కావడం లేదని త్రివిక్రమ్ కి మహేష్ చెప్పారట. దీంతో ఏం చేయాలనీ ఆలోచిస్తున్న సమయంలో సెట్స్ కి సంబంధించిన వారు.. ఆయుర్వేదిక్ బీడీ తీసుకొచ్చి ఇచ్చారట. అది లవంగం చెట్టు ఆకులతోటి తయారు చేశారట. ఈ విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో మహేష్ బాబు మాట్లాడుతూ.. ఇదే తన చివరి తెలుగు సినిమా కావొచ్చు అని చెప్పుకొచ్చారు. “రాజమౌళి తరువాత మళ్ళీ ఓ తెలుగు రీజినల్ సినిమా చేసే అవకాశం ఉంటుందో లేదో తెలియదు. దాని వల్ల మళ్ళీ కమర్షియల్ పాటలకి డాన్స్ లు వేసే అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే ఈ సినిమాలో కనీసం రెండు పాటలకి అయినా బాగా డాన్స్ వేయాలని నిర్ణయించుకున్నాను” అంటూ పేర్కొన్నారు.