Mahesh Babu : నాలో ఆ టాలెంట్ ఉంది.. ఒక రెండు గంటలు ఒకరితో మాట్లాడితే చాలు..

గుంటూరు కారం ప్రమోషన్స్ లో ఉన్న మహేష్ బాబు.. తనలోని ఓ టాలెంట్ గురించి మాట్లాడారు. అదేంటంటే..

Mahesh Babu : నాలో ఆ టాలెంట్ ఉంది.. ఒక రెండు గంటలు ఒకరితో మాట్లాడితే చాలు..

Mahesh Babu shares his unique talent in guntur kaaram movie promotions

Updated On : January 16, 2024 / 2:53 PM IST

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘గుంటూరు కారం’ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ అదిరిపోయే కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది. ఇక ఈ మూవీ షూటింగ్ రిలీజ్ ముందు వరకు జరగడంతో ప్రమోషన్స్ సరిగ్గా చేయలేకపోయారు. దీంతో రిలీజ్ తరువాత ప్రమోషన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే మహేష్, శ్రీలీల కలిసి యాంకర్ సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు.

ఇక ఈ ఇంటర్వ్యూలో ‘గుంటూరు కారం’లోని మహేష్ స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ గురించి మాట్లాడగా, మహేష్ బాబు బదులిస్తూ.. “నేను ఆ స్లాంగ్ అండ్ క్యారక్టరైజేషన్ కొత్తగా ట్రై చేసింది కాదండి. ఎవరికి తెలియని విషయం ఏంటంటే.. మా అమ్మ, అమ్మమ్మ గుంటూరు స్లాంగ్ లోనే మాట్లాడేవారు. వారితో నేను ఇంటిలో అలాగే మాట్లాడేవాడిని. నాకు ఓ టాలెంట్ ఉంది. ఎవరితో అయినా ఒక రెండు గంటలు మాట్లాడితే వారిని అచ్చు గుద్దినట్లు అలాగే దింపేస్తాను. ఆ టాలెంట్ గురించి త్రివిక్రమ్ గారికి బాగా తెలుసు. దానినే ఆయన ఉపయోగించుకున్నారు” అంటూ చెప్పుకొచ్చారు.

Also read :Guntur Kaaram : ‘గుంటూరు కారం’ సక్సెస్ సెలబ్రేషన్స్ ఫొటోలు..

మహేష్ బాబుకి త్రివిక్రమ్ ఏదైనా సీన్ చెప్పాలంటే, ఆ సమయంలో మీరు ఇలా మాట్లాడారు కదా అని చెప్పి.. అలా చేసేయండి అని చెబుతారంటా. ‘అతడు’ సినిమాకి ఇలా చేయలేదంట. ‘ఖలేజా’ మూవీకి ఇలా రిఫరెన్స్ చెప్పడంతోనే మహేష్ ఆ పాత్రని చాలా ఈజీగా చేసేశారట. అందుకనే ఆ పాత్ర చాలా నేచురల్ గా ఉంటుందని, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలోని రమణ పాత్రని కూడా త్రివిక్రమ్ అలాగే డిజైన్ చేశారని మహేష్ చెప్పుకొచ్చారు.

అలాగే ఈ సినిమాలో మహేష్ కాల్చిన బీడీల గురించి ఓ నిజం బయట పెట్టారు. మహేష్ కి స్మోకింగ్ అలవాటు లేదు, అలాగే దానిని ఎంకరేజ్ చేసే ఆలోచన కూడా లేదంటూ చెప్పుకొచ్చారు. సినిమాలో కాల్చిన బీడీలు.. ఆయుర్వేదిక్ ఆకులతో ప్రత్యేకంగా చేయించినవి అని చెప్పుకొచ్చారు.