Mahesh Babu Shares a Photo with his pet Dog in New Look
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం(Guntur Kaaram) షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మహేష్ సోషల్ మీడియాలో చాలా తక్కువ యాక్టివ్ గా ఉంటాడని తెలిసిందే. కానీ ఇటీవల అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు జోష్ ఇస్తున్నాడు. ఎక్కువగా తన జిమ్ ఫోటోలు షేర్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు మహేష్.
తాజాగా మహేష్ తన పెంపుడు కుక్కని ఎత్తుకొని ఫోటోని షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. మహేష్ ఇంట్లో రెండు పెంపుడు కుక్కలు(Dog) ఉండగా అందులో ఇటీవల ఒకటి చనిపోవడంతో ఇంకో కొత్త కుక్కని తీసుకొచ్చి దానికి స్నూపీ అని పేరు పెట్టారు. తాజాగా మహేష్ స్నూపీని ఎత్తుకొని దిగిన ఫొటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Also Read : Guntur Kaaram : గుంటూరు కారం షూటింగ్ అయిపోయిందా? అప్పుడే డబ్బింగ్ మొదలుపెట్టి..
అయితే మహేష్ కుక్కని ఎత్తుకున్న ఫొటో వైరల్ అవ్వడం కంటే మహేష్ కొత్త లుక్ లో ఉన్నాడంటూ మరింత వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో మహేష్ ఎక్కువ జుట్టు పెంచుకొని, హెయిర్ వెన్కక్కి వేసుకొని హెడ్ బ్యాండ్ పెట్టుకోవడంతో ఈ లుక్ బాగుంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఈ లుక్ గుంటూరు కారం సినిమా కోసమా లేక హెయిర్ ఊరికే పెంచాడా మహేష్ అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.