Mahesh Babu
Mahesh Babu : నేడు మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని పుట్టినరోజు. ఇప్పటికే మహేష్ అభిమానులు సితారకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. మహేష్ బాబు తన కూతురుతో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసి సోషల్ మీడియాలో స్పెషల్ గా విషెష్ చెప్పాడు.
కూతురితో దిగిన ఫొటో షేర్ చేసి.. అప్పుడే తను టీనేజర్ అయిపోయింది. హ్యాపీ బర్త్ డే సితార. నా జీవితంలో ఎప్పుడూ వెలుగుని నింపుతావు. లవ్ యు సోమచ్ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. మహేష్ పోస్ట్ కింద ప్రియాంక చోప్రాతో పాటు పలువురు సెలబ్రిటీలు సితారకు విషెస్ చెప్తున్నారు.
Also Read : CM Revanth Reddy : రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ భారీ నజరానా.. ఎంతంటే?
ఇక మహేష్ భార్య నమ్రత కూడా సితార చిన్నప్పట్నుంచి దిగిన పలు ఫోటోలు షేర్ చేసి స్పెషల్ బర్త్ డే విషెష్ చెప్పింది. సితార అన్నయ్య గౌతమ్ కూడా తన చెల్లితో దిగిన ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పాడు. పలువురు ఫ్యాన్స్, సెలబ్రిటీలు కూడా సితారకు విషెష్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : Prerana Kambam : సీరియల్ లో హీరోకి ముద్దు పెట్టానని బ్రేకప్ చెప్పాడు.. బిగ్ బాస్ భామ ప్రేరణ కామెంట్స్..