CM Revanth Reddy : రాహుల్ సిప్లిగంజ్ కు సీఎం రేవంత్ భారీ నజరానా.. ఎంతంటే?
నేడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy
CM Revanth Reddy : పాతబస్తీ కుర్రోడిగా కటింగ్ షాప్ తో జీవనం మొదలుపెట్టి ప్రైవేట్ సాంగ్స్ తో పాపులారిటీ తెచ్చుకొని ప్రొఫెషనల్ సింగర్ గా మారి అనేక సినిమాల్లో తన పాటలతో మెప్పించి RRR సినిమాలో నాటు నాటు పాట ద్వారా అంతర్జాతీయ స్థాయిలో అస్కార్ దాకా వెళ్లి అక్కడ స్టేజ్ మీద కూడా పెర్ఫార్మ్ చేసేంత స్థాయికి ఎదిగాడు రాహుల్ సిప్లిగంజ్.
గత ఎన్నికలకు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ సిప్లిగంజ్ కు పది లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కోటి రూపాయల నగదు పురస్కారం ఇస్తామని తెలిపారు. అలాగే ఇటీవల గద్దర్ అవార్డుల సందర్భంగా ప్రత్యేకంగా రాహుల్ సిప్లిగంజ్ ను ప్రస్తావిస్తూ అతనికి ఏదో ఒక అవార్డు ఇవ్వాలి అని అన్నారు.
Also Read : AM Rathnam : పవన్ కళ్యాణ్ తో నా అనుబంధం 25 ఏళ్ళు.. హరి హర వీరమల్లు సినిమా గురించి నిర్మాత కామెంట్స్..
నేడు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం తరపున ప్రకటించారు. త్వరలోనే రాహుల్ కు ఆ నజరానా అందించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి.