Mahesh Babu Son Gautam Ghattamaneni Birthday Celebrations with Family
Gautam Ghattamaneni Birthday : సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తనయుడు గౌతమ్ పుట్టినరోజు ఆగష్టు 31న జరిగింది. ఈ ఏడాదితో గౌతమ్ 17వ ఏటలోకి అడుగు పెట్టాడు. బర్త్ డే సందర్భంగా తన ఫ్యామిలీ మెంబెర్స్ నుంచి మహేష్ అభిమానులు నుంచి గౌతమ్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
ఇక ఈ బర్త్ డే రోజున గౌతమ్ మహేష్ బాబు ఫౌండేషన్ లో సేవ కార్యక్రమం నిర్వహించి.. తన తండ్రి లాగానే తన గొప్ప మనసుని చాటుకున్నాడు. తన తండ్రి సొంత గ్రామం అయిన బుర్రిపాలెంలోని పిల్లలను కలుసుకొని వారి మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. వారి మధ్య కేక్ కట్ చేసి బర్త్ డేని సంతోషంగా జరుపుకున్న గౌతమ్.. అనంతరం వారికి స్పోర్ట్స్ కిట్స్ ని గిఫ్ట్స్ గా ఇచ్చాడు. అలాగే వినికిడి సమస్యతో బాధపడుతున్న కొంతమంది విద్యార్థులకు హియరింగ్ మెషిన్ కూడా అందజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని గౌతమ్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ.. తన బర్త్ డే ఇలా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు.
Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్.. ప్రముఖుల విషెస్
అనంతరం గౌతమ్ తన ఫ్యామిలీతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. మహేష్ బాబు, నమ్రత, సితార, తన బంధువులు కొంతమంది సమక్షంలో గౌతమ్ కేక్ కట్ చేసి బర్త్ డేని సెలబ్రేట్ చేసుకున్నాడు. మహేష్ బాబు గౌతమ్ కి కేక్ తినిపించాడు. గౌతమ్ బర్త్ డే వీడియోని నమ్రత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో మహేష్ అభిమానులు షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.