Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్‌.. ప్రముఖుల విషెస్

చిన్న మామ, నా గురువు, మహోన్నత ప్రజల నాయకుడు పవన్ కల్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని హీరో సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.

Pawan Kalyan: హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్‌.. ప్రముఖుల విషెస్

Pawan Kalyan

Updated On : September 2, 2023 / 1:05 PM IST

Pawan Kalyan – birthday: సినీనటుడు, జనసేన (JanaSena) అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ 52వ పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

‘ పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ఇవ్వాలని కోరుకుంటున్నాను ’ అని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ట్వీట్ చేశారు.

‘ సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల మనిషిగా, సమాజ శ్రేయోభిలాషిగా రాష్ట్ర జనహితాన్ని కోరుకునే మీరు.. నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్థిల్లాలని మనసారా కోరుకుంటున్నాను ’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

‘ జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న పవన్ కల్యాణ్ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్థిల్లాలని ఆకాంక్షిస్తున్నాను ’ అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.

‘ పవన్ కల్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. ఎలప్పుడు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను ’ అని హీరో రవితేజ ట్వీట్ చేశాడు.

చిన్న మామ, నా గురువు, మహోన్నత ప్రజల నాయకుడు పవన్ కల్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని హీరో సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. తనకు గార్డియన్ ఏంజెల్‌గా, టార్చ్ బేరర్ గా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశాడు. పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

‘ నా జీవితానికి వెలుగునిచ్చిన దాత ప్రదాత, నా దైవం జననేత జనసేన అధినేత. మీరు సంకల్పించిన మీ సంకల్పం చాలా గొప్పది. మీరు అనుకున్నది సాధిస్తారు.. సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. మీ పట్టుదల మీ కృషి మీ కసి దగ్గరనుంచి చూసిన మీ భక్తున్ని మాకు మీరేంటో నాకు తెలుసు.. మీ మనసు ఏంటో నాకు తెలుసు.. విజయీభవ.. మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై పవన్ కల్యాణ్ జై జై పవన్ కల్యాణ్ ’ అని నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

పవన్ కల్యాణ్ గారు హ్యాపీ బర్త్ డే అంటూ సినీ నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు. పవన్ సేవా దృక్పథం, అందరి కోసం పనిచేయాలన్న సంకల్పం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్, సినీ దర్శకుడు సంపత్ నంది, స్క్రీన్ రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ సహా పలువురు పవన్ కల్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

పవన్ కు చిరు విషెస్ ఇలా..

ప్రముఖుల ట్వీట్లు

Sourav Ganguly : సీఎం మమతా బెనర్జీ వెంట స్పెయిన్ పర్యటనకు వెళ్లనున్న కలిసి సౌరవ్ గంగూలీ