Mahesh Babu : ‘అలాంటివాడే అసలైన పురుషుడు’.. మెన్స్ డే సందర్బంగా మహేష్ స్పెషల్ పోస్ట్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.

Mahesh Babu special post on the occasion of Men Day

Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గుంటూరు కారం సినిమాతో మంచి సక్సెస్ సాధించిన మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం స్టార్ట్ చేసారు. రాజమౌళి కూడా ఈ సినిమా షూటింగ్ లొకేషన్ ల కోసం తిరిగారు. మహేష్ బాబు కేవలం సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే.

Also Read : Pushpa 2 : పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఇతనే..

అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశారు. నేడు పురుషుల దినోత్సవం సందర్బంగా మహేష్ బాబు ఈ పోస్ట్ షేర్ చేశారు. ఇక తను మార్డ్ లో భాగమవుతున్నట్టు తెలుపుతూ.. “మనిషి పట్ల గౌరవం, సానుభూతి ఓ మనిషికి ఉండాల్సిన నిజమైన లక్షణం. ప్రతిఒక్కరు సమానత్వం కోసం నిలబడండి. చేసే ప్రతి పనిలోనూ దయని చూసేవాడే అసలైన పురుషుడు” అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్బంగా మహేష్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.


ఇకపోతే మహేష్ బాబు.. మహిళలపై అత్యాచారాలు, వివక్షతకు వ్యతిరేకంగా ఉండడం, లింగ సమానత్వం కోసం ఏర్పాటు చేసిన “మార్డ్” అనే సామజిక కార్యక్రమంలో భాగస్వామి అయ్యారు. దీనికి సంబందించిన ప్రమోషన్స్ లో కూడా మహేష్ పాల్గొననున్నారు.