Mahesh Babu : గుంటూరు కారం కోసం మహేశ్ బాబు పాన్ ఇండియా రేంజ్ రెమ్యునరేషన్..?
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి, శ్రీలీల లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published On : July 20, 2023 / 04:03 PM IST
Mahesh Babu
Mahesh Babu Remuneration : సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu ) నటిస్తున్న చిత్రం గుంటూరు కారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రీలీల (Sreeleela) లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ (Thaman) సంగీతాన్ని అందిస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ మొదలు పెట్టగా, బ్రేక్‌లతో కొనసాగుతూ ఉంది. జగపతి బాబు, రేఖ, రమ్యకృష్ణ, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు రూ.78 కోట్లు+జీఎస్‌టీ ని పారితోషికంగా అందుకోబోతున్నారని ఆ వార్త సారాంశం. పాన్ ఇండియా హీరోలు సుమారు వంద కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే.. మహేశ్ ఓ రీజినల్ సినిమా కోసం ఇంత మొత్తం తీసుకోనున్నారని టాక్. దీంతో రీజినల్ సినిమాలకు సంబంధించి అత్యధిక మొత్తం తీసుకునే వారి జాబితాలో మహేశ్ అగ్రస్థానంలో ఉన్నారని అంటున్నారు. మరీ ఈ వార్తలో నిజమెంత ఉందనేది చిత్ర బృందం స్పందిస్తేగానీ తెలియదు.
Vijay Deverakonda : రౌడీ హీరో విజయ్ దేవరకొండను పరిగెత్తించిన అభిమాని.. ఏం చేశాడో తెలుసా..?
ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత మహేశ్ బాబు దర్శకదీరుడు రాజమౌళి డైరెక్టర్‌లో ఓ చిత్రంలో నటించనున్నాడు. యాక్షన్ అడ్వెంచర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. కాగా.. ఈ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు కొనసాగింపుగా మరో చిత్రాన్ని తెరకెక్కించే విధంగా క్లైమాక్స్ ఉంటుందని చెప్పారు. ఆ విధంగానే సీన్స్ రాసినట్లు వెల్లడించారు.
