ఏషియన్ సంస్థతో కలిసి గచ్చిబౌలిలో మహేష్ నిర్మించిన లగ్జీరియస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో ఎవెంజర్స్ చూసిన తర్వాత, అక్కడి స్టాఫ్ మహేష్‌తో కలిసి ఫోటోలు దిగారు..
రోజురోజుకీ అవెంజర్స్ : ఎండ్‌గేమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. సామాన్యులతో పాటు, సెలబ్రెటీలు కూడా ఈ సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.
రీసెంట్‌గా ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ సినిమా ఇంకా చూడలేదని, మా ఏఎంబీ సినిమాస్‌లో టికెట్స్ అడిగితే.. నాకే లేవని అన్నారని చెప్పిన మహేష్, మొత్తానికి అవెంజర్స్ మూవీ చూసాడు. ఏషియన్ సంస్థతో కలిసి గచ్చిబౌలిలో మహేష్ నిర్మించిన లగ్జీరియస్ మల్టీప్లెక్స్ ఏఎంబీ సినిమాస్‌లో ఎవెంజర్స్ చూసిన తర్వాత, అక్కడి స్టాఫ్ మహేష్‌తో కలిసి ఫోటోలు దిగారు.
ఆ పిక్‌ని షేర్ చేసి, ‘మై ఫస్ట్ @ AMB Cinemas’.. అంటూ, స్టాఫ్‌ని అభినందిస్తూ మహేష్ ట్వీట్ చేసాడు. ఆ పిక్స్‌ని ఏఎంబీ సినిమాస్ అఫీషియల్ ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేసారు. సోషల్ మీడియాలో ఈ పిక్ బాగా వైరల్ అవుతుంది. మహేష్ బాబు నటించిన 25వ సినిమా మహర్షి మే 9న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
My first at @amb_cinemas …#AvengersEndgame!! Loved the film and the experience ..Thankyou team AMB… You guys rock!!! ?????? pic.twitter.com/GlDOCqgBYq
— Mahesh Babu (@urstrulyMahesh) May 5, 2019