మహేష్ భార్య ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ : విరాట్ కోహ్లి వీడియో సందేశం..

కరోనా ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ వీడియో సందేశం..

  • Publish Date - March 20, 2020 / 11:11 AM IST

కరోనా ఎఫెక్ట్ : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ వీడియో సందేశం..

గతకొద్ది రోజులుగా ప్రపంచాన్ని వణికిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్ -19) గురించి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి తెలియచేస్తున్నారు. బాలీవుడ్ కథానాయికలు దీపికా పదుకొణే, అనుష్క శర్మ వంటి వారు ఇప్పటికే ‘సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్’ విసిరారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. ‘‘కోవిడ్ 19 బారిన ప‌డ‌కుండా ఉండ‌టానికి రెండు చేతుల‌ను శుభ్రం చేసుకోవాలి. దాదాపు 20 నుంచి 40 సెకన్ల పాటు రెండు చేతులను రుద్ది శుభ్రం చేసుకుంటే మంచిది. Stay Safety.. Stay Healthy’’.. ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేశారు నమ్రత.

క్రికెట్, సినిమా సందేశం..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఓ వీడియో విడుదల చేశారు. ‘ప్రస్తుతం మనమందరం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మహమ్మారిని ఎదుర్కొందాం.. మేం కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. Stay Home. Stay Safe. Stay Healthy’ అంటూ సందేశమిచ్చారు.