‘సర్కారు వారి పాట’.. చెవి పోగుతో మహేష్ మాస్ లుక్!

  • Publish Date - May 31, 2020 / 05:33 AM IST

తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. తన తర్వాత సినిమాకు సంబంధించిన టైటిల్‌ని ప్రకటించారు. ప్రీ లుక్‌తో పాటు టైటిల్ విడుదల చేశారు. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాకు “సర్కారు వారి పాట” అనే టైటిల్‌ ఖరారు చేశారు. 

ఫస్ట్ లుక్‌లో సూపర్‌స్టార్ అదరగొట్టేశారు. ఒక చెవికి రింగు, మెడపైన రూపాయి బిళ్ల టాటూతో మహేష్ కనిపించారు. చెవి పోగుతో మాస్ లుక్‌లో మహేష్ బాబు ఉన్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా వస్తోన్న ఈ సినిమా అధికారికంగా ఈరోజు ఉదయం అనగా మే 31న ఉదయం 9 గంటల 9 నిముషాలకు ప్రకటించారు. 

ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది. సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత వస్తున్న ఈ సినిమాని మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ ప‌తాకాలు కలిసి నిర్మిస్తున్నాయి.