సింగపూర్ మ్యూజియంలో దాన్ని ప్రతిష్టించడానికి ముందు, మహేష్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకురాబోతున్నారు.
ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వాక్స్ స్టాచ్యూ ఏర్పాటు చెయ్యనున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్‌లో మేడమ్ టుస్సాడ్స్ వారు మహేష్ కొలతలు తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికి మహేష్ మైనపు విగ్రహం రెడీ అయ్యింది. సింగపూర్ మ్యూజియంలో దాన్ని ప్రతిష్టించడానికి ముందు, హైదరాబాద్ తీసుకురాబోతున్నారని తెలుస్తుంది.
మహేష్ ఈమధ్యే ఏషియన్ సంస్థతో కలిసి నిర్మించిన ఏఎంబీ సినిమాస్‌లో, అభిమానుల కోసం మైనపు విగ్రహాన్ని అందుబాటులో ఉంచబోతున్నారు. మహేష్ విగ్రహాన్ని మషేష్ చేతుల మీదగా ప్రారంభించి, ఒక వారం పాటు ఏఎంబీ సినిమాస్‌లో ఉంచిన తర్వాత, సింగపూర్ మ్యూజియంలో విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇవాన్ రీస్ అనే శిల్పి మహేష్ వాక్స్ స్టాచ్యూని రూపొందిస్తున్నాడు. ఏఎంబీ సినిమాస్‌లో మహేష్ విగ్రహాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేదానిపై క్లారిటీ రావాల్సిఉంది.