×
Ad

School Life Trailer: తొలి ప్రేమ చాలా గొప్పది.. ఆకట్టుకుంటున్న స్కూల్ లైఫ్ ట్రైలర్

పులివెందుల మహేష్ హీరోగా,దర్శకుడిగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్. సావిత్రి, షన్ను హీరోయిన్స్ గా(School Life Trailer) నటిస్తున్న ఈ సినిమాను నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మిస్తున్నారు.

Mahesh Pulivendula's School Life movie trailer released (1)

School Life Trailer: పులివెందుల మహేష్ హీరోగా,దర్శకుడిగా చేస్తున్న సినిమా స్కూల్ లైఫ్. సావిత్రి, షన్ను హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను నైనిషా క్రియేషన్స్ బ్యానర్‌పై గంగాభవని నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు సుమన్, మురళీధర్ గౌడ్ నటిస్తున్న ఈ సినిమా బాలల దినోత్సవ(School Life Trailer) సందర్భంగా నవంబర్ 14న ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్.

Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

ఈ ఈవెంట్ లో నటుడు సుమన్ మాట్లాడుతూ.. “ఈ స్కూల్ లైఫ్ సినిమా నాలు చాలా ప్రత్యేకం. ఎందుకంటే, ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా మనసుకు చాలా దగ్గరగా అనిపించింది. రైతు పాత్రలో, రైతులకు అండగా ఉండే పాత్రలో ఈ సినిమాలో నేను కనిపిస్తాను. షూటింగ్ సమయంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల షూటింగ్ చేయలేకపోయాను. కానీ, మహేష్ మాత్రం నాకోసం వెయిట్ చేశాడు. ఈ సినిమాలో ఆమని గారు నాకు భార్యగా నటించారు. ఇక స్కూల్ లైఫ్ అనేది అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే జీవితం. ఆ వయసులో పుట్టే ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అంతే స్వచ్ఛంగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మహేష్ షూటింగును పూర్తి చేశారు” అన్నారు

Mahesh Pulivendula’s School Life movie trailer released

 

ఇక దర్శకుడు, హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ.. “ఒక సామాన్య ఆర్టిస్టు నుంచి ఈరోజు సినిమా చేసే స్థాయి వరకు వచ్చాను. ఈ ప్రయాణంలో నేను చాలా కోల్పోయాను. అయినప్పటికీ సినిమా బ్రతకాలి. ఆ ఒక్క ఆలోచనతోనే ఈ సినిమాను మీ ముందుకు తీసుకువస్తున్నాను. నవంబర్ 14వ తేదీన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దయచేసి చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. మా సినిమాలో కథే హీరో, బడ్జెట్ కాదు. క్రౌడ్ ఫండింగ్ చేసి ఈ సినిమా పూర్తి చేసాము. మా సినిమా టికెట్ కేవలం వంద రూపాయలు మాత్రమే ఉంటుంది. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.