ఈవారం బిగ్ బాస్ హౌజ్ నుంచి మహేష్ ఔట్ !

  • Publish Date - October 5, 2019 / 03:11 PM IST

హీరో నాగార్జున హోస్ట్‌గా చేస్తోన్న బిగ్‌బాస్ 3..మొదటి నుంచి కామెడీ, కాంట్రవర్సీలతో సాగుతోంది. బిగ్‌బాస్ షోలో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ పార్ట్, వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి టీవీలో ప్రసారం కాకముందే సోషల్ మీడియాలో ముందుగానే లీకవుతున్నాయి. ఈ ఆదివారంతో బిగ్‌బాస్ 3 మూడో సీజన్ 10 వారాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ వారం ఎలిమినేషన్‌కు వరుణ్ సందేశ్, పునర్నవి, రాహుల్, మహేష్ విట్ట నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. 

అయితే ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుండి మహేష్ విట్ట ఎలిమినేట్ కావడం పక్కా అంటున్నారు. ఇప్పటికే బిగ్‌బాస్ మహేష్ విట్ట.. తనకు ఇచ్చిన టాస్క్‌లను బాగానే ఆడుతున్నాడు. కానీ, ఓటింగ్‌లో మాత్రం ఈ వారం మహేష్ విట్టకు తక్కువ ఓట్లు వచ్చాయని తెలిసింది. ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మహేష్ విట్ట బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ వినబడుతోంది. అతను ఎలిమినేట్ అవుతాడో లేదో చూడాలంటే ఆదివారం వరకు వేచిచూడాల్సిందే.