1993 ఏప్రిల్ 23న విడుదలైన మేజర్ చంద్రకాంత్, 2019 ఏప్రిల్ 23 నాటికి 26 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది..
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు, శారద, మోహన్ బాబు, రమ్యకృష్ణ, నగ్మా, అమ్రిష్ పూరి ప్రధాన తారగణంగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన సినిమా.. మేజర్ చంద్రకాంత్.. కమర్షియల్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, దేశభక్తి వంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా 1993 ఏప్రిల్ 23న విడుదలైంది. 2019 ఏప్రిల్ 23 నాటికి 26 సంవత్సరాలు పూర్తిచేసుకుంటుంది. ఈ సనిమాలో మేజర్ చంద్రకాంత్‌గా ఎన్టీఆర్ జీవించేసారు. పుణ్యభూమి నాదేశం పాటలో ఛత్రపతి శివాజీ, వీరపాండ్య కట్టబ్రహ్మన, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గెటప్స్‌లో అలరించడం ఆయనకే చెల్లింది.
Also Read : సచిన్, అజిత్‌లకు పోలిక భలే కుదిరిందే!
బ్రహ్మానందం, బాబూ మోహన్, శ్రీహరి, సాయి కుమార్, గుమ్మడి, చలపతి రావు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎమ్.ఎమ్.కీరవాణి అందించిన సంగీతం ప్లస్ అయ్యింది. పుణ్యభూమి నాదేశం పాట ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. ఉలికి పడకు అల్లరి మొగుడా, ముద్దులతో ఓనమాలు, నీక్కావలసింది, సుఖీభవ సుమంగళి వంటి పాటలన్నీ బాగుంటాయి.
ఎన్టీఆర్ నటించిన చివరి కమర్షియల్ సినిమా ఇదే కావడం విశేషం.. తెలుగు సినిమా ఉన్నంత వరకు ప్రేక్షకుల ఆదరణ చూరగొంటూనే ఉంటుంది మేజర్ చంద్రకాంత్ చిత్రం.
Also Read : ఇదే బెస్ట్ ఆప్షన్ : బ్యాంకుల్లోని మీ బంగారం భద్రమేనా?
వాచ్, పుణ్యభూమి నాదేశం సాంగ్..