×
Ad

Akhanda 2: బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే.. ఇక థియేటర్స్ లో శివతాండవమే

Akhanda 2: బాలయ్యతో బోయపాటి శ్రీను ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి.

Makers planning paid premieres for Balakrishna Akhanda 2

Akhanda 2: మాస్ అనే మాటకు పర్ఫెక్ట్ యాప్ట్ అంటే నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. ఆయన సినిమాల్లో కనిపించే మాస్ ఎలిమెంట్స్ కి ఆడియన్స్ పిచ్చెక్కిపోతుంటారు. థియేటర్స్ షేక్ అవుతాయి. మరి అలాంటి హీరోకి అదే రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చే దర్శకుడు దొరికితే ఆ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కదా. ఆ దర్శకుడు మరోవరో కాదు బోయపాటి శ్రీను. బాలయ్యతో ఈ దర్శకుడు ఇప్పటికే సింహ, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశాడు. ఈ మూడు సినిమాలు ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ కాంబోలో మరోసారి అదే లెవల్లో ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధం అవుతోంది. అదే అఖండ 2(Akhanda 2). బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తోంది ఈ సినిమా.

Rajamouli-RGV: దెయ్యం సినిమా తీస్తే దర్శకుడు దెయ్యంగా మారాలా.. లాజిక్స్ తో కొట్టాడుగా.. రాజమౌళికి వర్మ సపోర్ట్..

ఇప్పటికే టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఈ సినిమా డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతోంది. దీంతో ఎప్పుడప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు ఆడియన్స్. అయితే, తాజాగా అఖండ 2 సినిమా గురించి ఒక క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, అఖండ 2 సినిమా కోసం పైడ్ ప్రీమియర్స్ వేయనున్నారట మేకర్స్. అది కూడా ఒకరోజు ముందుగానే. డిసెంబర్ 4 రాత్రి నుంచి ఈ పైడ్ ప్రీమియర్స్ వేస్తున్నారని సమాచారం. దీంతో, సినిమాపై ఉన్న నమ్మకంతోనే మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ న్యూస్ తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. డిసెంబర్ 4 నుంచే అఖండ 2 తాండవం థియేటర్స్ లో మొదలవుతుంది అని, అఖండ గా బాలయ్య విశ్వరూపం మరోసారి ఆడియన్స్ ను కట్టిపడేయడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాపై ఉన్న హైప్ చూస్తుంటే మొదటిరోజు రికార్డ్స్ బ్రేకింగ్ వసూళ్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో విడుదల అవుతుంది కాబట్టి కొంచం పాజిటీవ్ టాక్ వచ్చినా ఇండియా మొత్తం షేక్ అవడం మాత్రం ఖాయం అనే చెప్పాలి. ఇక అఖండ 2 సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తుండగా.. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.