Makers to give Ustad Bhagat Singh update for Diwali
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రస్తుతం ఓజీ ఇచ్చిన కిక్కులో ఉన్నారు. దాదాపు 12 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సమయం రావడంతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ వచ్చిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను దర్శకుడు సుజీత్ చూపించిన విధానానికి ఫిదా అవుతున్నారు. ఎక్కడ చూసినా ఓజీ.. ఓజీ.. నినాదాలతో థియేటర్స్ మోగిపోతున్నాయి. అంతలా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇక నార్మల్ ఆడియన్స్ కు సైతం సినిమా నచ్చడంతో బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా.
Hrithik Roshan: ఒక చిత్రహింసలా.. ఒక గాయంలా.. వార్ 2 రిజల్ట్ పై మొదటిసారి స్పందించిన హ్రితిక్
మొదటిరోజే ఏకంగా రూ.154 కోట్లు కొల్లగొట్టిన ఓజీ సినిమా కేవలం వారం రోజుల్లోనే రూ.360 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఓపక్క కాంతార 2 సినిమా విడుదలైనప్పటికీ ఓజీ ఊచకోత మాత్రం ఆగడంలేదు. ఈ రచ్చ ఇంకా తగ్గకముందే మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సినిమా మేకర్స్. పవన్ కళ్యాణ్ తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న విషయం తెలిసిందే. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ ఐన ఈ సినిమాపై కూడా ఆడియన్స్ లో మరీ ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే, ఈ సినిమా రిలీజ్ కోసం కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
ఇందులో భాగంగానే ఉస్తాద్ భగత్(Ustaad Bhagat Singh) సింగ్ రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రానుంది అనేది వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే, మైత్రి మూవీ మేకర్స్ ఈ విషయం పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారట. ఈ న్యూస్ తెలియడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దానికి కారణం, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోలో ఇప్పటికే వచ్చిన గబ్బర్ సింగ్. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మళ్ళీ ఈ కాంబోలో సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా రీచ్ అవుతుందా అనేది చూడాలి.