Makers using Coolie Promotions plan for Akhanda 2 promotions
Akhanda 2: ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను ప్రమోట్ చేసి ఆడియన్స్ దగ్గరకు తీసుకెళ్లడం ఒక ఎత్తుగా మారింది. అందుకే ప్రమోషన్స్ కోసం సరికొత్త దారులు వెతుకుతున్నారు మేకర్స్. కొంతమంది కమర్షియల్ గా ఆలోచిస్తుంటే మరికొంత మంది క్రియేటీవ్ గా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ 2(Akhanda 2) సినిమా కోసం కూడా మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచారు. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం రజినీకాంత్ కూలీ సినిమా కోసం వాడిన ట్రిక్ నే వాడనున్నారట.
Epic Title Glimpse: 90’స్ బయోపిక్ సీక్వెల్ ‘ఎపిక్’.. ఎలమంద పాటతో ఆనంద్ ఎంట్రీ అదుర్స్..
అదేంటంటే, కూలీ సినిమా రిలీజ్ టైం ఆ సినిమా మేకర్స్ ప్రముఖ ఆన్ లోనే మార్కెటింగ్ సంస్థ అమెజాన్ తో టయప్ అయ్యారు. అమెజాన్ నుంచి వచ్చే ప్రతీ ఆర్డర్ పై కూలీ సినిమా పోస్టర్స్ ప్రింట్ చేయించారు. ఇప్పుడు అదే ప్లాన్ ని అఖండ 2 కోసం వాడనున్నారట మేకర్స్. ఇకనుంచి అమెజాన్ నుంచి వచ్చే ప్రతీ పార్సల్ పైన అఖండ 2 పోస్టర్ ను విడుదల తేదీని ప్రింట్ చేయనున్నారట. అయితే, ఈ ప్రమోషనల్ ప్లానింగ్ పై బాలయ్య ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారట. ఎందుకంటే, ఇలా మార్కెటింగ్ చేసిన కూలీ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే ప్లాన్ తో వస్తున్న అఖండ 2 సినిమాకి కూడా అలాంటి టాక్ వస్తుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కానీ, అఖండ 2పై వస్తున్న ఇన్ సైడ్ టాక్ ఏంటంటే, ఈ సినిమాపై ఎలాంటి అనుమానాలు అవసరం లేదట. బాలకృష్ణ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలువనుంది అనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇక డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అఖండ ఫస్ట్ పార్ట్ కి బ్లాక్ బస్టర్ సంగీతం అందించిన తమన్ ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. మరి ఈ సినిమాకు విడుదల తరువాత ఎలాంటి రిజల్ట్ రానుంది అనేది చూడాలి.