మలైకా అరోరా యోగాసనాలు.. మెరిసిపోయింది

  • Publish Date - August 25, 2020 / 12:49 PM IST

పర్‌ఫెక్ట్ ఫిట్‌నెస్‌కు పేరుగా చెప్పుకునే బాలీవుడ్ భామ, నటి మలైకా అరోరా మరోసారి తన యోగాసనాల ఫోటోలను అభిమానులతో పంచుకుంది. మలైకా అరోరా యోగా మరియు వ్యాయామం రోజూ చేస్తూనే ఉంటారు. ఆమె పరిపూర్ణ శరీర రహస్యం ఇప్పుడు అందరికీ తెలుసు.



హెవీ డ్యూటీ వర్కౌట్స్ కారణంగా కాకుండా.. మంచిదైన పాత యోగా పద్దతిని అనుసరించి మలైకా అరోరా ఈ రోజుల్లో ఫిట్‌గా ఉంటుంది. అందుకు సంబంధించిన చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పంచుకుంటున్నారు. ఈ సంధర్భంగా ఆమె ఫిట్‌నెస్ దినచర్యను అనుసరించమని అభిమానులను కోరారు.



మలైకా ఇన్‌స్టాగ్రమ్‌లో తన యోగా భంగిమలను పంచుకుంది. ఇది ప్రతిఒక్కరి శరీరానికి ప్రయోజనకరంగా ఉంటుందని, మలైకా తన పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. యోగా భంగిమ శరీరంలోని ప్రతి కండరాన్ని విస్తరించడానికి సహాయపడుతుంది మరియు వ్యక్తి రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుందని ఆమె చెప్పారు. మలైకా ఫిట్నెస్ షెడ్యూల్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.





మలైకా అరోరా ప్రస్తుతం ఓ టీవీ షోలో డ్యాన్స్ ప్రోగ్రామ్‌కు జడ్జ్‌గా వ్యవహరిస్తున్నారు




ట్రెండింగ్ వార్తలు