×
Ad

Malavika Mohanan : నేను చిరంజీవి సర్ సినిమా చేయట్లేదు.. ప్రభాస్ హీరోయిన్ ట్వీట్ వైరల్..

తాజాగా మాళవిక మోహనన్ దీనిపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది.(Malavika Mohanan)

Malavika Mohanan

Malavika Mohanan : సినీ పరిశ్రమలో రూమర్స్ సాధారణమే. ఫలానా హీరోయిన్ ఆ సినిమాలో చేస్తుందట అని రూమర్స్ వస్తూనే ఉంటాయి. తాజాగా ప్రభాస్ సరసన రాజాసాబ్ లో నటిస్తున్న మాళవిక మోహనన్ పై కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. మాళవిక మోహనన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి.(Malavika Mohanan)

తాజాగా మాళవిక మోహనన్ దీనిపై స్పందిస్తూ ఓ ట్వీట్ చేసింది. తన ట్వీట్ లో.. నేను బాబీ సర్ దర్శకత్వంలో చిరంజీవి సర్ సినిమాలో నటిస్తున్నట్టు చాలా వార్తలు వస్తున్నాయి. నా కెరీర్ లో ఐకానిక్ చిరంజీవి సర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది. కానీ మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాను ఈ సినిమాలో నేను నటించట్లేదు అని తెలిపింది. దీంతో మాళవిక ట్వీట్ వైరల్ గా మారింది.

Also Read : Samantha : అప్పుడేమో చేసేసి.. ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్తున్న సమంత..

చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు అయ్యాక బాబీ డైరెక్షన్ లో సినిమా చేయనున్నారు. గతంలో బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేసి పెద్ద హిట్ కొట్టారు. రెండోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. మాళవిక ఈ సినిమాలో చెయ్యట్లేదు అని చెప్పడంతో మరి ఇందులో ఎవరు నటిస్తారో అని చర్చగా మారింది.