Samantha : అప్పుడేమో చేసేసి.. ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్తున్న సమంత..

తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.(Samantha)

Samantha : అప్పుడేమో చేసేసి.. ఇప్పుడు ఇబ్బంది పడ్డాను అని చెప్తున్న సమంత..

samantha

Updated On : October 28, 2025 / 11:54 AM IST

Samantha : చాలా మంది హీరోయిన్స్ తమకు నచ్చకుండానే కొన్ని పాత్రలు చేశామని, చేయాల్సి వచ్చిందని చెప్తారు. ఇష్టం లేనప్పుడు కేవలం అవకాశాల కోసమే అలాంటి పాత్రలు చేశామని చెప్తారు కొంతమంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. తాజాగా సమంత ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది.(Samantha)

సమంత మాట్లాడుతూ.. కెరీర్ ఆరంభంలో చాలా గ్లామరస్ పాత్రలు చేశాను. అవి నాలా అనిపించలేదు. వేరే హీరోయిన్స్ లా ఉండటానికి, వాళ్ళలాగా కనిపించడానికి, వాళ్ళలాగా నటించడానికి, వాళ్ళ లాగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించేదాన్ని. అలాంటి పాత్రల్లో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ క్యారెక్టర్స్ అన్ని కామెడీగా అనిపిస్తాయి. అప్పట్లో నేను ఎంత చెడ్డగా నటించానో అనుకునేదాన్ని. కానీ నేను నేర్చుకోడానికి అదొక్కటే మార్గం. పరిశ్రమలో ఎలాంటి సంబంధాలు లేకుండా నేనే స్వయంగా వచ్చి అన్ని నేర్చుకున్నాను అని తెలిపింది.

Also Read : Kasthuri Shankar : హీరో షేక్ హ్యాండ్ ఇచ్చాడని రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదు.. కట్ చేస్తే అతని పక్కనే హీరోయిన్ గా..

గతంలో సమంత చాలా సినిమాల్లో గ్లామర్ షో చేసింది. సికిందర్ లాంటి సినిమాలో బికినీ కూడా వేసింది. కొన్ని సినిమాలో రొమాంటిక్ సీన్స్, షార్ట్ డ్రెస్ లతో గ్లామర్ సీన్స్ చేసింది. అలాంటి గ్లామరస్ రోల్స్ అన్ని అప్పుడు అవకాశాల కోసమే చేశాను అని, అప్పుడు ఇబ్బంది పడుతూనే చేశాను అని చెప్పుకొచ్చింది సమంత.

దీంతో అంత కష్టం అయితే చేయడం ఎందుకు నో చెప్పొచ్చుగా అని పలువురు కామెంట్స్ చేస్తుండగా, ఇక్కడ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు, అన్ని రకాల పాత్రలు చేయాలి, అందుకే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఉంది అని అంటున్నారు మరికొంతమంది. అయితే ఇప్పుడిలా చెప్తున్న సమంత ఇటీవలే పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేయడం గమనార్హం. ఇక సమంత ప్రస్తుతం అడపాదడపా సినిమాలు, సిరీస్ లు చేస్తూ ఎక్కువగా బిజినెస్ ల మీద ఫోకస్ పెట్టింది.

Also Read : Ramya Krishna : ఇష్టం లేకపోయినా చేసింది.. తర్వాత సౌందర్యకు క్షమాపణలు చెప్పింది..