Ramya Krishna : ఇష్టం లేకపోయినా చేసింది.. తర్వాత సౌందర్యకు క్షమాపణలు చెప్పింది..
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ సీన్ ని ఇష్టం లేకుండానే చేసిందట.(Ramya Krishna)
Ramya Krishna
Ramya Krishna : నటీనటులు సినిమాల్లో కొన్ని సీన్స్ ఇష్టం లేకపోయినా చేస్తారు. ఆ పాత్ర బాగా పండాలంటే చేయక తప్పదు అని చేస్తారు. అలా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ సీన్ ని ఇష్టం లేకుండానే చేసిందట. రమ్యకృష్ణ ఇటీవల జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరయి అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ క్రమంలో నరసింహా సినిమా గురించి మాట్లాడింది.(Ramya Krishna)
రజినీకాంత్ హీరోగా రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్ గా తెరకెక్కిన నరసింహా సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. రమ్యకృష్ణ – సౌందర్య కలిసి పలు సినిమాల్లో నటించారు. అయితే నరసింహా సినిమాలో రమ్యకృష్ణ సౌందర్యని కాలుతో ముఖం తిప్పే సీన్ ఉంటుంది. ఆ సీన్ వల్ల ఈ ఇద్దరికీ గొడవలు అయ్యాయని రూమర్స్ కూడా వచ్చాయి. తాజాగా రమ్యకృష్ణ ఆ సీన్ గురించి మాట్లాడింది.

ఈ ఫొటోలు చూడండి : Komalee Prasad : అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
రమ్యకృష్ణ మాట్లాడుతూ.. నరసింహా సినిమాలో సౌందర్య ముఖం మీద కాలు పెట్టే సీన్ చేయాలి. నేను ఆ సీన్ చేయను అని చెప్పాను. అప్పటికే సౌందర్య స్టార్ హీరోయిన్. నేను ఆ సీన్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ డైరెక్టర్ రవికుమార్, సౌందర్య ఇద్దరూ కూడా చేయమని, పర్లేదు అని ఎంకరేజ్ చేసారు. సౌందర్య కూడా ఎంకరేజ్ చేసింది ఆ సీన్ కోసం. నాకు ఇష్టం లేకపోయినా ఆ సీన్ లో నటించాను. ఆ సీన్ షూటింగ్ అవ్వగానే వెంటనే సౌందర్యకు క్షమాపణలు చెప్పాను. సౌందర్య, డైరెక్టర్ బలవంతం వల్లే ఆ సీన్ చేయడానికి ఒప్పుకున్నాను అని తెలిపింది.

అలాగే సౌందర్యతో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ.. అమ్మోరు సినిమా సమయంలో సౌందర్యతో పరిచయం అయింది. తక్కువ సమయంలోనే దగ్గరయ్యాం. తను నా ముందే సినీ పరిశ్రమలోకి వచ్చి నా ముందే ఎదిగి పెద్ద స్టార్ అయింది. నా ముందే వెళ్ళిపోయింది. ఆమె లోటుని ఎవరూ తీర్చలేరు. మంచి మనసున్న ఫ్రెండ్ సౌందర్య అంటూ ఎమోషనల్ అయింది రమ్యకృష్ణ.
