Karthi : కార్తీకి తెలుగులో అన్ని కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారా? తమిళ్ కంటే ఎక్కువ.. మెగాస్టార్ సినిమా కోసం..?
కార్తీని మన తెలుగు హీరోలానే చూస్తారు ఇక్కడి ప్రేక్షకులు.(Karthi)
Karthi
Karthi : తమిళ్ స్టార్ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మంచి మార్కెట్ ఉంది. కార్తీ ప్రతి సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తమిళ్ లో కార్తీ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా ఇక్కడ తెలుగులో ఇట్ అయ్యాయి. కార్తీ కూడా ఎన్నో సార్లు తెలుగు ప్రేక్షకులను పొగిడాడు. తమిళ మీడియా ముందే, తమిళ వేదికల మీదే తెలుగు సినీ పరిశ్రమ గురించి తెలుగు ప్రేక్షకుల గురించి గొప్పగా చెప్పాడు కార్తీ.(Karthi)
కార్తీని మన తెలుగు హీరోలానే చూస్తారు ఇక్కడి ప్రేక్షకులు. కార్తీ గతంలో నాగార్జున ఊపిరి సినిమాలో డైరెక్ట్ తెలుగులో నటించి మెప్పించాడు. మళ్ళీ కార్తీ డైరెక్ట్ తెలుగులో ఎప్పుడు నటిస్తాడా అని ఎదురుచుస్తున్నారు. హిట్ 4 సినిమా కార్తీతో ప్రకటించినా కార్తీ లైనప్, శైలేష్ కొలను లైనప్స్ తో అది ఇప్పట్లో అయ్యేలా లేదు. అయితే తాజాగా కార్తీ మరో తెలుగు సినిమాలో కనిపించబోతున్నట్టు, ఆ సినిమా కోసం కార్తీకి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు సమాచారం.
ఇది కూడా చదవండి : Darshan : ఆ సినిమాలో సుధీర్ బాబు తనయుడు.. అప్పుడు మహేష్ మామయ్య కోసం ఇప్పుడు ప్రభాస్ కోసం..
ఇటీవల మెగాస్టార్ చిరంజీవి – బాబీ కాంబోలో రెండో సినిమాని ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ సినిమాలో కార్తీని కీలక పాత్ర కోసం సంప్రదించారని సమాచారం. ఈ సినిమా కోసం కార్తీకి 23 కోట్ల భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేసారట. కార్తీ ప్రస్తుతం తమిళ్ లో 12 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. అలాంటింది అంత ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి తెలుగులో, అది కూడా కీలక పాత్ర కోసం ఆ రేంజ్ రెమ్యునరేషన్ ఇచ్చి తీసుకుంటారా అని చర్చ జరుగుతుంది.
చిరంజీవి ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారు, విశ్వంభర సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమాలు చేయనున్నారు. ఇక కార్తీ చేతిలో వా వాతియార్, సర్దార్ 2, ఖైదీ 2, హిట్ 4, మార్షన్.. సినిమాలు ఉన్నాయి. మరి మెగాస్టార్ చిరంజీవి – కార్తీ కాంబో ఎప్పుడొస్తుందో చూడాలి.
ఈ ఫొటోలు చూడండి : Supritha Surekhavani : మోకాళ్లపై మెట్లు ఎక్కి.. తిరుమల దర్శనం చేసుకున్న తల్లీకూతుళ్లు..
