Darshan : ఆ సినిమాలో సుధీర్ బాబు తనయుడు.. అప్పుడు మహేష్ మామయ్య కోసం ఇప్పుడు ప్రభాస్ కోసం..

మహేష్ మేనల్లుళ్లు గా ఈ ఇద్దరికీ మంచి ఫేమ్ వచ్చింది. (Darshan)

Darshan : ఆ సినిమాలో సుధీర్ బాబు తనయుడు.. అప్పుడు మహేష్ మామయ్య కోసం ఇప్పుడు ప్రభాస్ కోసం..

Darshan

Updated On : October 28, 2025 / 7:15 AM IST

Darshan : హీరో సుధీర్ బాబు తనయులు ఇద్దరూ కూడా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ మేనల్లుళ్లు గా ఈ ఇద్దరికీ మంచి ఫేమ్ వచ్చింది. సుధీర్ బాబు పెద్ద కొడుకు చరిత్ మానస్ పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. త్వరలో హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక సుధీర్ బాబు చిన్న కొడుకు దర్శన్ ఆల్రెడీ అడివి శేష్ గూఢచారి, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించాడు.(Darshan)

ఆ రెండు సినిమాల్లో హీరో చిన్నప్పటి పాత్రల్లో నటించి మెప్పించాడు దర్శన్. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో సుధీర్ బాబు కొడుకు నటించబోతున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో తన రెండో తనయుడు దర్శన్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నాడు అని సుధీర్ బాబు స్వయంగా తన సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో తెలిపాడు.

Also See : Supritha Surekhavani : మోకాళ్లపై మెట్లు ఎక్కి.. తిరుమల దర్శనం చేసుకున్న తల్లీకూతుళ్లు..

ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రను దర్శన్ పోషించబోతున్నట్టు తెలుస్తుంది. మహేష్ మేనల్లుడు ప్రభాస్ సినిమాలో నటిస్తుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. దీంతో మహేష్ ఫ్యాన్స్, సుధీర్ బాబు ఫ్యాన్స్ కూడా మహేష్ మేనల్లుడు దర్శన్ ఏ రేంజ్ లో ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో మెప్పిస్తాడా అని ఫౌజీ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.