Kasthuri Shankar : హీరో షేక్ హ్యాండ్ ఇచ్చాడని రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదు.. కట్ చేస్తే అతని పక్కనే హీరోయిన్ గా..
తాజాగా కస్తూరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ టాలీవుడ్ హీరో గురించి మాట్లాడింది.(Kasthuri Shankar)
Kasthuri Shankar
Kasthuri Shankar : ఒకప్పటి హీరోయిన్ కస్తూరి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో, సీరియల్స్ లో నటిస్తూ బిజీగానే ఉంది. తన కెరీర్ ని యాంకర్ గా, న్యూస్ రీడర్ గా మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ అయింది. అప్పుడప్పుడు వివాదాల్లో నిలుస్తూ మరింత వైరల్ అవుతుంది కస్తూరి శంకర్. తాజాగా కస్తూరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది.(Kasthuri Shankar)
ఈ క్రమంలో కస్తూరి ఓ టాలీవుడ్ హీరో గురించి మాట్లాడింది.
Also Read : Ramya Krishna : ఇష్టం లేకపోయినా చేసింది.. తర్వాత సౌందర్యకు క్షమాపణలు చెప్పింది..
కస్తూరి శంకర్ మాట్లాడుతూ.. నేను యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టాను. కాలేజీలో చదివేటప్పుడే యాంకరింగ్ చేసేదాన్ని. మొదట్లో ఎక్కువగా కార్పొరేట్ ఈవెంట్స్ చేసేదాన్ని. ఓ ఈవెంట్ లో నాగార్జున గారు పరిచయం అయ్యారు. అప్పటికే ఆయన చాలా మందికి ఫేవరేట్ హీరో. ఆ ఈవెంట్లో నాతో మాట్లాడారు. ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే నేను రెండు రోజులు చెయ్యి కడుక్కోలేదు. నాగార్జున షేక్ హ్యాండ్ ఇచ్చాడు అని అందరికి చెప్పాను. మా క్లాస్ మేట్స్ అమ్మాయిలు జెలస్ ఫీల్ అయ్యారు. టీనేజ్ లో ఆ హ్యాపీనెస్ వేరు.
ఆ తర్వాత అన్నమయ్య సెట్ లో కలిసినప్పుడు, ఆ సినిమాలో నటించినప్పుడు నా కల నెరవేరింది అనిపించింది. ఆయన్ని కలిసి చాలా రోజులు అయింది. మళ్ళీ ఏదో ఒక సాకు చూసుకొని కలవాలి. మళ్ళీ నాగార్జున గారితో కలిసి పని చేయాలని ఉంది. అప్పట్లో మేము ఆయన్ని హీరోగా గొప్పగా చూస్తే ఇప్పటి జనరేషన్ విలన్ గా కూడా ఆయన్ని చూసి ఫిదా అవుతున్నారు అని తెలిపింది. ఇటీవల రజినీకాంత్ కూలి సినిమాలో నాగార్జున స్టైలిష్ విలన్ గా నటించి తమిళనాడులో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Also See : Komalee Prasad : అరుణాచలం ఆలయ దర్శనం చేసుకున్న హీరోయిన్.. ఫొటోలు..
