Malavika Mohanan: ఫేస్‌కి మాస్క్ లేకపోతే నగ్నంగా ఉన్న ఫీల్!

కరోనా మహమ్మారి ఈ ప్రపంచం మీద ఎప్పుడైతే పంజా విసిరిందో అప్పటి నుండి మనుషుల అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహార అలవాట్లతో పాటు శుభ్రత విషయంలో ఒక పద్ధతి వచ్చింది.

Malavika Mohanan (Image:Instagram)

Malavika Mohanan: కరోనా మహమ్మారి ఈ ప్రపంచం మీద ఎప్పుడైతే పంజా విసిరిందో అప్పటి నుండి మనుషుల అలవాట్లలో చాలా మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆహార అలవాట్లతో పాటు శుభ్రత విషయంలో ఒక పద్ధతి వచ్చింది. ఇక మాస్క్ విషయంలో అయితే అందరికీ ఇది కామన్ అయిపొయింది. మొదటిలో కొంత మాస్క్ అంటే అసౌకర్యంగా అనిపించినా అందరూ ముక్కు, మూతికి మాస్క్ కి అలవాటు పడిపోయారు. కొందరైతే మాస్క్ లేకపోతే ఏదో వెలితిగా భావనలోకి వచ్చేశారు. అలాంటి వారిలో హీరోయిన్ మాళవికా మోహన్ కూడా చేరిపోయింది.

మాళవికాకు మాస్క్ లేకపోతే నగ్నంగా ఉన్న ఫీల్ వచ్చేస్తుందట. మాళవికా ప్రస్తుతం కార్తీక్ న‌రేన్ ద‌ర్శ‌క‌త్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ నటిస్తున్న మార‌న్‌ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోనే జరుగుతుండగా మీడియాతో చిట్ చాట్‌ చేసింది. షూటింగ్ జరిగేసమయంలో మాస్క్ లేకుండా ఉండడం తనకు న‌గ్నంగా ఉన్న భావ‌న క‌లుగుతోందని చెప్పుకొచ్చింది. డ్రెస్సింగ్ లో ముఖ్యమైన వ‌స్తువుగా మారిపోయిన మాస్క్ ను తీసేయాల్సి వ‌స్తే క‌ష్టంగా అనిపిస్తుందని చెప్పింది.

ఇక, మాళవికా సినిమాల విషయానికి వస్తే.. హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకి తమిళనాట సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘పేటా’, దళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలతో గుర్తింపు వచ్చింది. మాస్టర్ సినిమాలో అదిరిపోయే నటనతో గుర్తింపు తెచ్చుకున్న అమ్మడు.. ఎప్పటికప్పుడు హాట్ అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం తెలుగు సినిమాల వైపు దృష్టి పెట్టిన ఈ మలయాళ బేబీ విజయ్ దేవరకొండ సినిమాలో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది.