Malavika Mohanan : విజయదేవరకొండతో రొమాంటిక్ సినిమా చేయాలి అంటున్న తమిళ హీరోయిన్

మాళవిక మోహనన్ తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్...............

Vijay Devarakonda

Malavika Mohanan :  తమిళ్ లో రజినీకాంత్ పేట సినిమాలో, విజయ్ సరసన మాస్టర్, ధనుష్ సరసన మారన్.. ఇలా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది మాళవిక మోహనన్. అవి తెలుగులో కూడా డబ్ అవ్వడంతో తెలుగు ప్రేక్షకులకి కూడా బాగానే పరిచయం అయింది మాళవిక. ఇక సోషల్ మీడియాలో అదరగొట్టే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

మాళవిక మోహనన్ తాజాగా ట్విట్టర్ లో తన అభిమానులతో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్.. మీరు రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోలతో నటించారు, తర్వాత ఎవరితో నటించాలి అనుకుంటున్నారు అని అడిగాడు. దీనికి మాళవిక మోహనన్ సమాధానమిస్తూ.. విజయ్ దేవరకొండతో ఓ రొమాటికి, లవ్ స్టోరీలో నటించాలని ఉంది అని తెలిపింది.

Aadhi Pinisetty-Nikki Galrani : ఆది పినిశెట్టి-నిక్కీ గల్రాని పెళ్లి వేడుకలు

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఈ ట్వీట్ ని మరింత షేర్ చేస్తున్నారు. గతంలోనూ పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ కూడా విజయ్ దేవరకొండతో నటించాలని ఉంది అని తెలిపారు. దీంతో మరోసారి విజయ్ కి అమ్మాయిల్లో బాగా ఫాలోయింగ్ ఉందని అర్ధమవుతుంది. మరి విజయ్ సినిమాలో ఈమెకు ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.